200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర తెలుసా?

0
2012

ప్రతి ఊరులోనూ ఎల్లమ్మ,పోచమ్మ,కట్ట మైసమ్మ ఇలా కొన్ని రకాల పేర్లతో అమ్మవారి ఏదో ఒక ఆలయం అనేది తప్పకుండ ఉంటుంది. గ్రామదేవతలుగా పూజించే పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెలు అని చెబుతారు. మరి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఎలా వెలసింది? ఆ ఆలయ స్థల పురాణం ఏంటి? ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ujjaniతెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల పూర్వం వెలసిన ఈ అమ్మవారు గ్రామదేవతగా పూజలను అందుకుంటుంది. ఈ అమ్మవారు మహాకాళి అవతారం అని చెబుతారు. ఈ అమ్మవారిని మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలా అనేక పేర్లతో భక్తులు పిలుచుకుంటారు.

ujjaniఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 వ సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేలమంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతడు, తన సహా ఉద్యోగులు కలసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలని రక్షించమని కోరుకొని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయాన్ని కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆలా 1815 లో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన అతను మొక్కు ప్రకారం ఇక్కడే అమ్మవారికి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రతి ఆషాఢమాసంలో అప్పటి నుండి బోనాల జాతర అనేది నిర్వహిస్తున్నారు.

ujjaniఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో రెండు రోజుల పాటు జాతర అనేది చాలా గొప్పగ జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంకా ప్రతి సంవత్సరంలో శ్రావణమాసంలో భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈవిధంగా ఇక్కడ వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే తల్లిగా భక్తులు కొలుస్తున్నారు.

SHARE