Home Unknown facts హనుమంతుడి గురించి చాల మందికి తెలియని కొన్ని రహస్యాలు

హనుమంతుడి గురించి చాల మందికి తెలియని కొన్ని రహస్యాలు

0

రామాయణం ప్రకారం హనుమంతుడు రాముడి యొక్క నమ్మిన బంటు అని అందరికి తెల్సిన విషయం. రామ నామం జపిస్తూ ఎల్లప్పుడూ రాముడి పాదదాసుడిగానే ఉంటాడు. మనలో చాలా మందికి హనుమంతుడు అంటే ఒక పెళ్లి కానీ బ్రహ్మచారి,రామదూత,బలశాలి ఇలా అనేక రకాలుగా మాత్రమే తెలుసు. మరి హనుమంతుడి గురించి తెలియని మరిన్ని విషయాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Hanumanహనుమంతుడు అంజనీ పుత్రుడు అని అంటారు. అయితే అయన జననం వెనుక ఒక రహస్యం ఉంది. పురాణ విషయానికి వస్తే, బ్రహ్మ దేవుని భవనంలో అందమైన అప్సర అంజనాదేవి. ఒక ముని ఆగ్రహానికి గురై ఎవరిని అయితే నువ్వు ప్రేమిస్తావో ఆ మరుక్షణం నువ్వు కోతి రూపంలోకి మారిపోతావని అంజనాదేవిని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆమెకి సహాయపడాలని భావించి భూలోకానికి పంపిస్తాడు. భూలోకానికి వచ్చిన అంజనాదేవి వానరరాజైన కేసరిని కలిసి అతడిని వివాహం చేసుకుంటుంది. అంజనా శివుడి యొక్క భక్తురాలు అయితే శివుడి కోసం గొప్ప తపస్సు చేయగా ఆ పరమశివుడు ఆమెకి కొడుకుల జన్మించి ఆమెను శాపం నుండి విముక్తిని కలిగిస్తాడు. అందుకే హనుమంతుడు శివుడి అవతారంగా కొలుస్తారు.

ఇక రామాయణం విషయానికి వస్తే, ఒక రోజు సీతాదేవి సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు దాని ఉపయోగం ఏంటి అని ప్రశ్నించగా, అప్పుడు సీతాదేవి శ్రీరాముడి దీర్ఘాయుష్షుకోసం ఇలా చేస్తున్న అని జవాబు ఇచ్చింది. ఆ క్షణంలో రామదూత చిటికెడు సింధూరమే ఇంతే చేస్తే ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటే ఇంకా రామ ప్రభువు యొక్క ఆయుష్షు బాగుంటుందని భావించి తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకొని రాముడి ఆయుష్షు కోసం ప్రార్థిస్తాడు.

హనుమంతుడు బ్రహ్మచారి అని అందరు చెబుతుంటారు కానీ ఆయనకి ఒక వివాహం మరియు అయన కారణంగా ఒక చేప శిశువుకు జన్మనిస్తుంది. ఇది నిజం అని చెప్పడానికి ఒక పురాణ కథ ఉంది. హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు హనుమంతుడి తల్లి గారు విద్యాబ్యాసం నేర్చుకోవడానికి సూర్యిడిని మించిన గురువు లేడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు వచ్చే చీకటి పోగొడతాడని హనుమంతుడికి చెప్పుతుంది. అప్పటి నుండి హనుమంతుడు సూర్యభగవానుడిని నుండి అనేక వేదాలు నేర్చుకుంటూ ఉంటాడు.

అలా పూర్తిగా చదువు పూర్తి అయ్యాక హనుమంతుడు సూర్యినితో అంటాడు,నాకు విద్య నేర్పించి నన్ను ఇంతటి వాడిని చేసిందనుకు చాలా కృతజ్ఞుడిని అని సంబోదించగా అప్పుడు సూర్య భగవానుడు నాకు గురు దక్షణ కింద నువ్వు నా కుమార్తె అయినా సువర్చలా ను వివాహం చేసుకోవాలని చెప్పుతాడు. దీని వెనుకాల ఆంతర్యం ఏంటి అంటే హనుమంతుడు వేదాలలో నైపుణ్యం సాధించగా “నవ వ్యాకరణం” చదవడానికి అర్హుడు కాదు ఎందుకంటే అది కేవలం పెళ్లి అయినా వారు మాత్రమే అభ్యసించాలి. అందుకోసమే సూర్యభగవానుడు సువర్చలా అనే అందమైన కుమార్తెని సృష్టించి హనుమంతుడికి ఇచ్చి వివాహం చేసి ఆయనని గృహస్తుడని చేస్తాడు.

హనుమంతుడి లంకకి కి వెళ్లి తన తోకతో లంకకి నిప్పటించి తిరిగి వస్తు సముద్రంలో తన ఒంటిని చల్లర్చుకుంటాడు. ఆ సమయంలో హనుమంతుడి చెమట సముద్రపు నీటిలో కలసి ఆ నీటిని ఒక చేప సేవిస్తుంది. ఆ చేప మకరధ్వజకు జన్మనిస్తుంది. ఈ మకరధజాన్ని రావణుడి సోదరుడు, పాతాళలోక రాజు అహిరావణుడు తర్వాత బంధించాడు. అయితే మకరధ్వజ పెద్దయ్యాక అహిరావణుడు తన బలం మరియు శక్తిని చూసి మెచ్చి, తన సైనికుడిగా మార్చుకుంటాడు.

రాముడిపైన ఉన్న భక్తిని చూసి సీతాదేవి ఒక ముత్యాలహారాన్ని హనుమంతుడికి కానుకగా ఇవ్వగా, శ్రీరాముడు లేనిదీ ఏది నాకు ఒద్దు అని తిరస్కరిస్తాడు. మరి నీ శరీరంలో శ్రీరాముడు ఉన్నాడా అని ప్రశ్నించగా అప్పుడు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపించి అయన భక్తిని చాటుకుంటాడు.

ఇలా హనుమంతుడి గురించి ప్రతి విషయం కూడా ఎంతో భక్తి భావంతో కూడి ఆయనపైనే ఉండే నమ్మకాన్ని మరింత పెరిగేలా చేస్తాయి.

 

Exit mobile version