Songs Of Janaki Amma Garu That Will Reverberate In Our Hearts For A Lifetime

గాన కోకిలమ్మకి జన్మదిన శుభాకాంక్షలు

సంగీతానికి భాషతో అవసరం లేదు.. ఏ భాషలో ఉన్న పాట అయినా.. మనకు నచ్చిందంటే మళ్లీ మళ్లీ వింటాం. అదే విధంగా సినిమాలో పాటలు పాడే గాయకులకు వయస్సుతో పని లేదు. పాటకి తగ్గట్లు ఎవరికైనా, ఏ వయస్సు వారికైనా పాటలు పాడగలరు. అదే గాయకులకు ఉన్న గొప్ప లక్షణం. అలాంటి వాళ్లలో మనకు ముందుగా గుర్తొచ్చే ఒక గాయని పేరు ‘ఎస్.జానకి’. ప్రేమగా ఆవిడ అభిమానులు, సంగీతప్రియులు ‘జానకమ్మ’ అని పిలుచుకుంటారు. ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇంత మందితో ‘అమ్మ’ అని పిలిపించుకునే అదృష్టం ఎంత మందికి ఉంటుంది చెప్పండి..?
అంతటి గొప్ప గాయని, ” NIGHTINGLE OF INDIAN CINEMA”జానకమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి కాసేపు…

చెప్పుకోవడానికి ఎప్పుడో వచ్చిన సింగర్ అనుకున్నా… ఇప్పటికీ, ఈ జనరేషన్ లో కూడా జానకమ్మ పాటలు విని ఆనందపడే అభిమానులు ఎంతో మందిఉన్నారు. రేడియోల కాలం నుండి.. ఇప్పటివరకు ఆవిడ గొంతు వింటూనే ఉన్నాం. జానకమ్మ పాడడం ఆపేసి ఎన్నో ఏళ్లు అవుతున్నా.. ఆ పాటలుఇప్పటికీ మన మనసుల్లోంచి వెళ్లిపోలేదు. చాలా మంది సింగర్స్ ఉన్నారు.. మరి జానకమ్మ గొప్పతనం ఏంటో చెప్పమంటారా..! ఆవిడ అప్పుడే మాటలునేర్చుకుంటున్న పసిపాప గొంతు వినిపించగలదు.. అమ్మలా లాలించగలదు.. ఒక పడుచు అమ్మాయిలా ప్రేమ పాఠాలు చెప్పగలదు.. హస్కీ గొంతుతో మత్తుగా గమ్మత్తు చేయగలదు.. ముసలమ్మలా గొంతుని వణికించగలదు.. చివరికి అబ్బాయిలా కూడా గొంతు మార్చగలదు. ఒక గొంతుతో ఇన్ని మ్యాజిక్లు చేయగలిగే ఒకే ఒక అద్భుతం.. ఖచ్చితంగా జానకమ్మే.

జానకమ్మ పెద్దగా సంగీతం నేర్చుకోలేదు.. అయినా ఎలాంటి పాటని అయినా ఈజీగా పాడే టాలెంట్ చిన్నప్పటి నుంచే వచ్చేసిందట. అంతెందుకు…ఆవిడ అసలు చదువుకోలేదు. కేవలం పాటలు పాడటానికి మాత్రమే అక్షరాలు నేర్చుకున్నారట. అలా నేర్చుకునే ఇంత పేరు సంపాదించడం, ఇన్ని
వేల పాటలు పాడడం ఎలా సాధ్యం అంటారు..? ఇప్పుడు టెక్నాలజీ వచ్చి పని తగ్గింది కానీ.. అప్పట్లో లైవ్ గా పాడేవారట. పాటలో ఎక్కడ తప్పు దొర్లినా.. మళ్లీ మొదటి నుంచి పాడేవారట అప్పటి మన సింగర్స్. అంత కష్టమైన పాటలు నేర్చుకుని, సరిగ్గా పాడి.. ఇన్ని ఏళ్లయినా మనం ఇంకా వింటున్నాం
అంటే.. దాని వెనక వాళ్లు ఎంత కృషి చేసి ఉంటారు..!

చిన్నప్పుడు జానకి గారు.. లతా మంగేష్కర్ గారి పాటలు ఎక్కువగా వినేవారట. తను పాటలు పాడడం మొదలుపెట్టిందే ఏవీఎం లాంటి పెద్ద సంస్థలో.ఘంటసాల గారు, పీబీ శ్రీనివాస్ గారు, బాల మురళీకృష్ణ గారి దగ్గర నుండి… ఏసుదాసు గారు, బాలు గారు, మనో గారి వరకు అందరితో కలిసి పాటలుపాడారు. అసలు బాలు గారు సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి ఒక కారణం జానకమ్మే. ఆవిడ గాన మాధుర్యానికి ఎన్నో సత్కారాలు, ఎన్నో పురస్కారాలు, మరెన్నో అవార్డులు వరించాయి. జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
. కానీ ఆ అవార్డుకు జానకమ్మ ఒప్పుకోలేదు… ”ఇస్తే భారతరత్న ఇవ్వండి.. లేదంటే వద్దు” అని గట్టిగానే చెప్పేసింది. అదీ తనపై, తన టాలెంట్ పై జానకమ్మకి ఉన్న నమ్మకం.

60 ఏళ్ల గాన ప్రస్థానాన్ని ముగిస్తూ.. 2017లో మైసూరులో చివరి కాన్సర్ట్ చేసి సినిమా పాటలకు వీడ్కోలు చెప్పారు. తన వయస్సుతో సంబంధం లేకుండా.. అన్ని రకాల పాటలు పాడిన ఒకే ఒక్క సింగర్ జానకమ్మ. తన 60 ఏళ్ల కెరీర్ లో చిన్నపాప దగ్గర నుండి ముసలి బామ్మ వరకు అన్ని పాత్రలకు
తన గొంతు ఇచ్చారు. ఈ పాట జానకి గారు పాడారా..? అని అనిపించేలా.. ఒక గొంతు ఇన్ని రకాలుగా పాడగలదా అనిపించేలా ఉంటాయి అవి. ఆవిడకు మాత్రమే సాధ్యమైన అలాంటి ప్రయోగాలు ఇప్పుడు విందామా..!

1. జానకమ్మ గొంతులో పసిపాప..

2. ఒకే పాటలో తల్లీ, కొడుకుకి..

3. పదహారేళ్ల అమ్మాయిలా…

4. ఇలా ఎవరైనా నవ్వగలరా…

5. ముసలమ్మకి ఇలా..

6. గొంతులో ఇంత మత్తు, కైపు…

7. ఈ పాట మధ్యలో ఒక హమ్మింగ్ ఉంటుంది… సూపర్ అంతే

8. 62 ఏళ్లకి ఇలా ఎవరైనా పాడుతారా..?

9. కామెడీగా కథ చెపుతూ…

10. ఐటమ్ సాంగులు పాడినా ఆవిడే..

11.అమ్మతనం గురించి ఆవేదనగా ..

12. తన చివరి సినిమా పాట ఇదే..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR