Home Health కరోనా వల్ల కలిగే గొంతు నొప్పి ఏ విధంగా ఉంటుంది? ఎలా గుర్తించాలి?

కరోనా వల్ల కలిగే గొంతు నొప్పి ఏ విధంగా ఉంటుంది? ఎలా గుర్తించాలి?

0

ఎంతగా కరోనా నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నామో అంతగా ఆ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరంతో పాటు.. దగ్గు, ఒళ్లు నొప్పులు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. కానీ వీటితోపాటు గొంతు సమస్య కూడా వేధిస్తుంది. వైరస్ లక్షణాలు.. జలుబు లేదా ఫ్లూ తరహాలోనే ఉంటాయి. ఈ లక్షణాలు కంటే ముందుగా గొంతు నొప్పితో సమస్య మొదలవుతుందని సమాచారం.

గొంతు నొప్పిగొంతు తరచుగా పొడిబారుతూ ఉంటే కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నట్టుండి గొంత శబ్దం చిన్నగా రావడం, గొంతులో పిచ్ కలిగి ఉన్నట్టు అనిపిస్తే.. అవి కరోనా లక్షణాలే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోవిడ్ -19 మహమ్మారి శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలలను ప్రభావితం చేస్తుందని.. స్వరపేటికపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ కారణంగానే గొంతులో మార్పులు వస్తాయని వివరించారు. గొంతులో మంట, దురదగా.. వాపు ఏర్పడినట్లుగా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా కోవిడ్-19గా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు.

దగ్గు, జలుబు రావడంతో పాటు గొంతులో మండినట్లుగా అనిపించడం కోవిడ్19 లక్షణమేనని సీడీసీ సూచిస్తోంది. ఇదివరకు కూడా ఇలాంటి సమస్య చాలా మందికి ఉండవచ్చు. కానీ ప్రస్తుత సమయంలో మాత్రం గొంతులో నొప్పి, మండుతున్నట్లుగా అనిపిస్తే కరోనా లక్షణాలుగా భావించాలి. ఎంతుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు గురైన వ్యక్తుల్లో 52 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు గణంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలో మిలియన్ల మంది ప్రజల గొంతులో మార్పులను గమనించారట. లక్షలాది మంది నుండి వచ్చిన డేటా ప్రకారం, గొంతులో మార్పు కూడా కోవిడ్ -19 యొక్క లక్షణమని నిర్ధారించట. దీని ప్రకారం, కరోనా సోకిన వారి గొంతు బిగ్గరగా మారడం లేదా కఠినంగా మారడం వంటి లక్షణాలను గుర్తించారట. ఇది శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలలను ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా దీని ప్రభావం స్వర పేటికపై ఉంటుందని తేలిందట. కొందరిలో కోవిడ్ -19 సోకే సమయంలో గొంతు పెద్దగా మారిపోతుందని వారు స్పష్టం చేశారు.

అయితే, గొంతు నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. అన్ని గొంతు నొప్పులు ‘కోవిడ్-19’ కాకపోవచ్చని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణం బట్టి మన గొంతులో సాధారణంగా కొంత మార్పులు జరుగుతుంటాయి. వాతావరణం మారినా, బ్యాక్టిరీయా ఇన్ఫెక్షన్లు ఏర్పడినా లేదా టాన్సిల్స్లిటిస్ వల్ల గానీ గొంతు నొప్పి ఏర్పడవచ్చు. అయితే ప్రస్తుతం కరోనా వంటి కష్ట కాలంలో గొంతులో అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. ఇంట్లో వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న సమయంలోనూ మాస్క్ ధరించాలి. అదే సమయంలో వేసవి కాలం అని చల్లని పదార్థాలను తినకండి. ఎల్లప్పుడూ వేడి చేసుకుని చల్లారిన తర్వాత లేదా వెచ్చగా ఉండే నీటిని తాగండి. అనునిత్యం మీ గొంతును తడిగా ఉంచాలి. అదేవిధంగా మీ గొంతు నొప్పిని తగ్గించేందుకు హెర్బల్ ట్రీట్మెంట్ కూడా ప్రయత్నించొచ్చు. అప్పటికీ గొంతు రఫ్ గా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ టెస్టు ఫలితాలను బట్టి మీకు కరోనా సోకిందా లేదా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే ఎవరికైనా అకస్మాత్తుగా చలిగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని కొట్టిపారేయవద్దు. ఇతరులకు లేనిది ఓ వ్యక్తి చలి పెడుతుందని చెప్పాడంటే అది కరోనా లక్షణంగానే భావించాలని రీసెర్చర్లు చెబుతున్నారు. ఆ లక్షణాలు కనిపించిన వారు కోవిడ్19 టెస్టులు చేయించుకుని నిర్ధారించుకోవాలి. కరోనా లక్షణాలు వెంటనే బయటపడవు కనుక మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. పదే పదే వణుకుతున్నారంటే వైరస్ అప్పుడే సోకి ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు. అందులోనూ భారత్ లాంటి దేశంలో ఎండ కాలంలో చలి అంటూ ఎవరైనా వణికారంటే కరోనా లక్షణాలుగా భావించాల్సి ఉంటుంది.

 

Exit mobile version