గోధుమలతో చేసిన చపాతీల కన్నా ఇవే మంచివట!

లాక్ డౌన్ వల్ల ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బంధించినట్టయింది. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులతో రోజు మొదలుపెట్టేవారిని ఇంటికే పరిమితం చేసింది లాక్ డౌన్. ఆఫీస్ లకి, స్కూల్స్, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఇంట్లోనే గంటల తరబడి కదలకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో బరువు పెరిగిపోయినవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఎలాగైనా బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తూ తిండి మానేస్తున్నారు. మరి కొందరు అన్నం మానేసి తృణధాన్యాలు తింటున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు తెలుసా. అందులో జొన్న రొట్టెలు ముఖ్యమైనవి.

weightతృణధాన్యాల కంటే జొన్న రొట్టెలు తింటే సులభంగా బరువు తగ్గుతారని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వీటితో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిరుధాన్యాల్లో ఒకటి జొన్నలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ జొన్నలను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలోని 500 మినియన్ల ప్రజలు ఆహార ధాన్యంగా ఉపయోగిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే జొన్నలను మన భారతదేశంలో ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తుంటారు. జోవార్, సొర్లుమ్, క్వినోవా అని పిలుస్తున్నారు.

sorghum rotiతెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్న పంటను అధికంగా పండిస్తారు. అయితే గతంలో జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే తినేవారు. కానీ ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకు ముందు చపాతీ మాత్రమే తినేవాళ్లలో చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జొన్నరొట్టెలు చాలా బలవర్ధకమైన అహారం. జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరగుతాయి. దాని వల్ల బరువు పెరగకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

sorghumఈ జొన్నల్లో శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి సహాయం చేసే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి అనేక సూక్ష్మపోషకాలు ఉన్నాయి. అందుకనే ఈ జొన్నలతో రొట్టెలనే కాదు.. పేలాల, పేలాలు లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి చేస్తారు. గోధుమలలో ఉ౦డే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికి సరిపడట౦ లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదు.అ౦దువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦గా జొన్నలపై ప్రప౦చ౦ తనదృష్టి సారి౦చి౦ది. దీంతో జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా డిమాండ్ ఏర్పడింది.

sorghum plantsఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో పెడుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌ ఉండటం వల్ల ఎముకలకు మంచిది. ఎముక పుష్టి కూడా ఉంటుంది. మెటబాలిజం పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్‌ సమస్యలు నయం చేస్తుంది. ఎనర్జీ లెవ్స్‌ను మెయింటైన్‌ చేస్తుంది. బ్లడ్‌ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

blood sugarనిజానికి శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలా కాకుండా అవ‌స‌రానికి మించి చెడు కొలెస్ట్రాల్ పెరిగితే. వెంట‌నే గుండె జ‌బ్బులు దాడి చేస్తాయి.అయితే జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో ఉండే ఫైబర్ అద‌నంగా పెరిగిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించేస్తుంది. అదే స‌మ‌యంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దాంతో గుండెపోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఈ జొన్న రొట్టెల‌ను రోజుకు రెండు చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకున్నా.. ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR