బరువు పెరగాలి అనుకునేవారు ఈ ఆహారాన్ని తప్పక తీసుకోవాలి ?

ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఊబకాయం. గంటల తరబడి కూర్చొని పని చేసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి వారి నుండి తరచూ మనం వినే ప్రశ్న బరువు పెరిగిపోతున్నాం సన్నబడేదెలా? అని. అయితే ఇలాంటి వారే కాదు సన్నగా ఉన్నాం కొంచె బరువు పెరిగాలంటే ఎలా అని అడిగే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. బరువు పెరగాలంటే ఇవి ఫాలో అయి చూడండి, ఫలితం గ్యారంటీ.

Special diet for weight gainభోజనం చేసినప్పుడు ఏదో తిన్నాం, కడుపు నిండింది అన్నట్టు ఉండకూడదు. ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. పిండి పదార్థం పుష్కలంగా ఉండే బంగాళదుంపలాంటి ఆహారం తీసుకోవాలి.

Special diet for weight gainఏది తిన్నా టైంకి తినడం చాలా అవసరం. సమయానికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం చేయాలి. ఆలస్యంగా తినడం మంచిది కాదు. ఏ సమయంలో ఏం తినాలి అని ఒక ప్రణాళిక రూపొందించుకుని ఫాలో ఉత్తమం.

రెండు, మూడు గంటలకొకసారి తినడం వల్ల క్యాలరీల స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి సాయంకాలం లేదా అప్పుడప్పుడు చిరుతిళ్లు తీసుకోవాలి. పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను స్నాక్స్ రూపంలో తీసుకోవాలి.

Special diet for weight gainశక్తిని అందించే ఆహార పదార్థాలు డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, అవకాడో, గింజలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు పెరగడానికి ఇవి తోడ్పడతాయి.

Special diet for weight gainడ్రై ఫ్రూట్స్ రుచికరంగానే కాదు, తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. కాబట్టి బాదం, కాజూ, ఎండుద్రాక్ష తీసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా అయినా ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు.

Special diet for weight gainపండ్లు తక్షణ శక్తితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కాబట్టి పండ్లను డైట్ లో చేర్చుకోవాలి. అరటిపండు లాంటివి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. పండ్లు ఇష్టపడని వాళ్లు జ్యూస్ రూపంలో తాగితే సరిపోతుంది.

Special diet for weight gainప్రొటీన్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మాంసం, చేపలు, యోగర్ట్, బీన్స్ వంటి వాటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువు పెరగడానికి తోడ్పడతాయి.

Special diet for weight gainరోజుకి 5 వందల క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వారానికి ఒక పౌండ్ బరువు పెరగుతారు. ఆహారం తయారు చేసేటప్పుడు వెన్న, చీజ్ లు కలిపితే ఎక్కువ మోతాదులో ఈజీగా క్యాలరీలు పెరుగుతాయి. మొక్కజొన్నలు, బఠానీలు కూడా బరువు పెరగడానికి తోడ్పడతాయి.

Special diet for weight gainఅయితే బరువు పెరగాలన్న ఆశతో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లపై మోజు పెంచుకోకూడదు. వీటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. హెల్తీ ఫుడ్స్ ఎంచుకోవడం వల్ల ఆరోగ్యంగానూ ఉండవచ్చు, బరువు కూడా పెరగవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR