Home Unknown facts దైవ దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు… ఎందుకు?

దైవ దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు… ఎందుకు?

0
  • ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి.
  • సాధారణంగా ఆలయంలో దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిపేపు కూర్చొంటారు. ఇలా ఎందుకు కూర్చొంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్ది సేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెపుతున్నాయి.
2
  • స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌనధ్యానంతో, కొంతసమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్రసమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అనికాదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.
  • అలాగే, ఆలయ ప్రవేశానికీ కొన్ని నియమాలున్నాయి. ఆలయం ప్రవవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్థు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా.. ఎవరివద్దా ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతనూ దేవాలయాల్లో చూపించరాదు.
  • దేవుడు అందరికీ దేవుడే. దైవకార్యాలకు అందరూ పెద్దలే. దైవప్రీతికి అందరూ పాత్రులే. దైవపూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి.

Exit mobile version