పాము కాపలాగా ఉండే భాగ్యవంతిదేవి ఆలయ రహస్యం

0
5638

మనం చేసిన తప్పులు తొలగిపోవాలని, మనకు ఉన్న దరిద్రం పోయి అదృష్టవంతలం అవ్వాలనే కోరిక అందరికి ఉండటం సహజం. అయితే ఈ దేవాలయంకి వెళితే మన దురదృష్టం పోయి అదృష్టవంతులుగా మారడమే కాకుండ ధనవంతులు కూడా అవుతారని చెబుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి మరిన్ని విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ammavaaruకర్ణాటకలోని దత్తక్షేత్రమైన గాణగాపురానికి సుమారు 30కిమీ ల దూరంలో,గుల్బర్గానుంచి 50కిమీ ల దూరంలో భువనేశ్వరి దేవి ఆలయం వుంది. ఆ తల్లిని ఆరాధిస్తే భాగ్యవంతులౌతారు అని నమ్ముతారు ఈ దేవి దారిద్ర్యాన్ని దూరంచేసి అదృష్టాన్ని వరంగా కరుణించేదేవత. దీనికి ఒక ఆథ్యాత్మికపురాణ కథ కూడా వుంది. కృష్ణదేవరాయలకాలంలో శ్రీ కృష్ణదేవరాయలు పూర్వికులందరూకూడా భువనేశ్వరి దేవిని భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ తల్లి ఆ రాజవంశీకులను రక్షిస్తూవస్తోంది. ఈ విధంగా ఈ తల్లి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజులు భక్తి-శ్రద్ధలతో పూజించేవారు.ఆ రాజులలో చివరి రాజైన రామరాయ ఈ దేవిని నిర్లక్ష్యం చేసి పూజించుట ఆపివేశారంట.

ammavaaruఅప్పుడు తనని పూజించటంలేదని ఆగ్రహించిన దేవి తుంగభద్రనదిలో దూకి, తుంగభద్ర మరియు కృష్ణానదిలో ఈదుకుంటూ భీమానది సంగమంలో దేవి వెలిసెను. భీమానది సంగమంలో కొంతకాలం నీటిలోనే ఉంది ఆ తర్వాత రామరాయుని రాజ్యం పతనమై ముస్లిం రాజుల చేతిలో వశమాయెను.

ammavaaruతదనంతరం కొంతకాలం తర్వాత నీటిలో వున్న దేవిని ఒక భక్తుడు భీమానది సంగమంలో ఈ దేవి ఎవరు అని గుర్తించెను.అప్పుడు దేవి అతనికి కనిపించి ఆ నదిలో నేను ఎల్లప్పుడూ వుంటాను మరియు ఒక ఆలయాన్ని నిర్మిస్తే, ఆమె గ్రామంలోని అందరి ప్రజలను కాపాడుతాను అని చెప్తుంది.

ammavaaruజరిగిన వృత్తాంతమంతా ఆ భక్తుడు గ్రామస్థులకు చెప్తాడు. అదేవిధంగా గాజురూపంలో స్థూపాన్ని ప్రారంభించినప్పటి నుంచి, ఆ స్థూపం నల్లనిరూపం దాల్చెను. అదే సమయంలో అక్కడేవున్న ఒక పాము కూడా ఆ దేవికి కాపలాకాస్తుండేను. అదే విధంగా ప్రజలందరూ చేరి దేవాలయాన్ని నిర్మించారు.

ammavaaruఆ తర్వాతికాలంలో ఆ గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా మరియు వుత్తమమైనజీవితాన్ని గడిపారు. అదేవిధంగా అందరూ అదృష్టవంతులైనారు. ఇదంతా ఆ తల్లి మహిమ వల్లేనని ఆ తల్లిని కొనియాడిరి. అదే విధంగా ఈ దేవిని శ్రీ భాగ్యవంతిదేవి అని పిలుస్తూ ఆరాధించారు.

ammavaaruఈ మహిమాన్వితమైన దేవాలయం లో వెలసిన ఈ అమ్మవారిని భాగ్యవంతిదేవి అని భాగ్యమ్మ, కామధేను, కల్పతరువు, భాగమ్మ అని ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు. ఇక్కడ వెలసిన ఈ దేవిని ఆరాధించటానికి వందల కొద్దీభక్తులు ఎప్పుడు తరలి వస్తుంటారు.

7 adrustanni prasadinche ammavaru