Home Unknown facts శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద ఏంటి? చివరకు శమంతకమణి ఏం అయింది?

శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద ఏంటి? చివరకు శమంతకమణి ఏం అయింది?

0

సత్రాజిత్తు శమంతకమణి ని సూర్యభగవానుడి దగ్గరి నుండి పొందుతాడు. అయితే సత్రాజిత్తు ధరించిన శమంతకమణి ని చూసిన శ్రీకృష్ణుడు దానిని తనకి ఇవ్వమని అడుగగా దానికి సత్రాజిత్తు అంగీకరించాడు. ఆ తరువాత శమంతకమణి ని జాంబవంతుడు దొంగలించగా ఆ అపనింద శ్రీకృష్ణుడి పైన పడుతుంది. మరి అసలు శమంతకమణి ఏంటి? శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద ఏంటి? చివరకు శమంతకమణి ఏమయ్యిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shamantakamaniపూర్వం నిఘ్నుడు అనే ఒక రాజు ఉండగా అతడికి సత్రాజిత్తు, ప్రసేనుడు అనే ఇద్దరు కొడుకులు. ఒక రోజు సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధించగా, సూర్యుడు విపరీతమైన కాంతితో దర్శనమివ్వగా ఆ కాంతి వలన సత్రాజిత్తుకి సూర్యుడు కనిపించలేదు. అప్పుడు సూర్యభగవానుడు నేను ఈరోజు శమంతకమణి ధరించి ఉన్నందున నీకు కనిపించలేదు అని ఆ మణిని తీసి పక్కనబెట్టాడు. అప్పుడు ఆ మణిని చూసి ఆశపడిన సత్రాజిత్తు శమంతకమణి ని తనకివ్వమని ప్రార్ధించగా, ఇది ధరించడానికి అందరు అర్హులు కారు, ఈ మణి అగ్నికి సంబంధించినది. రోజుకు కావాల్సినంత బంగారాన్ని కూడా ఇస్తుందని కొన్ని జాగ్రత్తలను చెప్పి దానిని సత్రాజిత్తుకు ఇవ్వగా, ఆ మణి ధరించి విపరీతమైన కాంతితో రావడం చూసిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడిగి శమంతకమణి గురించి తెలుసుకొని దానిని తనకివ్వమని అడుగగా ఇవ్వడానికి సత్రాజిత్తుడు నిరాకరించాడు.

ఇది ఇలా ఉంటె, వినాయకచవితి పూజలో శమంతకమణి కథ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చుస్తే అపనిందలు తప్పవు అని అంటారు. శ్రీకృష్ణుడు చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తాడు. అయితే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణి ధరించి వేటకు వెళ్లగా అయన వెళుతున్న అశ్వాన్ని ఒక సింహం చంపి, ప్రసేన జిత్తును పంజాతో విసిరేసి, శమంతకమణిని తీసుకొని వెళుతుంది. అయితే ప్రసేనుడిని చంపి శ్రీకృష్ణుడే శమంతకమణి దొంగలించాడనే అపనింద వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణి వెతుకుంటూ ఆ సమయంలో జాంబవంతుడి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని గుహలోకి వెళ్తాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు చనిపోయినా సింహాన్ని, గుర్రాన్ని దాటుకొని జాంబవంతుడు ఉన్నగుహలోకి వెళ్తాడు. ఆ మణి గురించి శ్రీ కృష్ణుడు ఎంత చూపిన జాంబవంతుడు వినకపోవడంతో ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఇలా 28 రోజుల భీకర ద్వంద్వ యుద్ధం తరువాత రాముడితో యుద్ధం చేయాలనే కోరిక నెరవేరడంతో యుద్దాన్ని విరమించి మణిని, తన కూతురిని శ్రీకృష్ణుడి చేతిలో పెడతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరి సత్రాజిత్తుకు మణిని అప్పగించడంతో తన తప్పుని తెలుసుకొని శ్రీకృష్ణుడికి తన కుమార్తె అయినా సత్యభామని ఇచ్చి వివాహం చేసి శమంతకమణి కూడా ఇవ్వగా ఆ మణిని సత్రాజిత్తుకే ఇచ్చి శ్రీకృష్ణుడు సత్యబామతో కలసి వెళ్ళిపోతాడు. ఇక చివరకు శ్రీకృష్ణుడు తనువూ చాలించిన తరువాత ద్వారకా తో పాటుగా శమంతకమణి కూడా సముద్ర గర్భంలో కలసిపోయిందని, ఇప్పటికి మునిగిపోయిన ద్వారకాలో ఎక్కడో ఒక చోట శమంతకమణి ఉండే ఉంటుందని కొందరి నమ్మకం.

Exit mobile version