మహాభారతం చివరలో శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యాలు

దేవతలందరిలో శ్రీకృష్ణుడి శైలి అందరిని చాలా ఆకట్టుకుంటుంది. ఇక మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. ఎందుకంటే కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు ? అనే సందేహాలు చాల మందిలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా కృష్ణుడు తన సమాధాన్ని అప్పుడే చెప్పాడు. మరి శ్రీ కృష్ణుడు చెప్పిన ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Krishnaశ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలను అడిగాడు. అవి ఏంటంటే, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని అడుగంటా, అప్పుడు దానికి శ్రీకృష్ణుడు, ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు.

Krishnaధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని జవాబు ఇచ్చాడు.

Krishnaఅప్పుడు ఉద్ధవుడు, అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ? అని అడుగగా, కృష్ణుడు, జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను అని అనగా ఉద్ధవుడు, అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో , చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ? అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేయగా అప్పుడు కృష్ణుడు, ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు అని చెప్పాడంటా.

Krishnaదేవుడు ఎక్కడ లేదు అను నిత్యం మన పక్కనే ఉంటాడు ఆ విషయాన్ని మనం గుర్తించి ముందుకు వెళితే చాలు జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందని శ్రీ కృష్ణ రహస్యంగా చెపుతారు.

Krishna

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR