పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్న అద్భుత ఆలయం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లక్ష్మి పద్మావతి సమేత ఇక్కడ దర్శనం ఇస్తుండగా, ఈ స్వామికంటే ముందే సర్పదేవతైన నాగేశ్వరుడు వెలిసాడని పురాణం. మరి ఇక్కడ నాగేశ్వరుడు ఎలా వెలిసాడు? శ్రీ వేంకటేశ్వరస్వామి ఎవరు ప్రతిష్టించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైకుంఠపురం వెంకటేశ్వరఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో శ్రీ వైకుంఠపురం వెంకటేశ్వర దేవాలయం ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయ ఆవరణలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అనేక కట్టడాలు మనకి దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం గర్భగుడి, అంతరాలయం, మండపం అనే మూడుభాగాలుగా ఉండగా, గర్భాలయంలో లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువై ఉండగా, ఈ స్వామివారికి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు.

వైకుంఠపురం వెంకటేశ్వరఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం అరణ్యంలో ఉండే ఈ ప్రాంతానికి ఎలాంటి పేరు అనేది లేదు, అయితే ఇక్కడ ఒక పుట్ట ఉండగా అది మాములు పుట్టగానే చాలాకాలం అలానే ఉండిపోయింది. ఒకరోజు ఒక భక్తుడికి నాగేశ్వరుడు కలలో కనిపించి, నేను ఒక పుట్టలో ఉన్నాను, ఆ పుట్ట ఇక్కడి ప్రాంతంలో ఉంది, నీవు నన్ను బయటకి తీసి ఆరాధించు నీకు శుభం కలుగుతుందని చెప్పాడట. మరునాడు తనకి వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెప్పి వెళ్లి అక్కడి పుట్టలో చూడగా నిజంగానే దేవతామూర్తులు ఉండటంతో వాటిని బయటికితీసి ఆ స్వామివారికి నాగేశ్వరుడు అనే పేరుని పెట్టి అక్కడే ప్రతిష్టించి ఆరాధించారు.

వైకుంఠపురం వెంకటేశ్వరఇలా కొంతకాలం తరువాత ఈ ప్రాంతంలో నాగేశ్వరుడు వెలిసాడని తెలిసిన కంచికామకోటి పీఠాధిపతుల వారు ఈ ప్రాంతానికి వచ్చి ఆ నాగేశ్వరుడిని ఆరాధించి, ఇక్కడే లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి మూర్తిని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణానికి పునాదులు వేసి, ఈ ప్రాంతాన్ని వైకుంఠపురం అని ప్రశంసించాడు. ఇలా కాలక్రమేణా ఈ ఆలయ విషయం అందరికి తెలిసి రోజు రోజుకి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది.

వైకుంఠపురం వెంకటేశ్వరఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడి స్వామివారి సన్నిధిలో ఎక్కువగా కల్యాణాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా సర్పదేవుడైన నాగేశ్వరుడికి, శ్రీ వెంకటేశ్వరస్వామికి వైకుంఠ ఏకాదశినాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

వైకుంఠపురం వెంకటేశ్వర

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR