గ్రామదేవతగా వెలసిన శ్రీ మరిడమ్మ ఆలయం గురించి తెలుసా ?

ఇక్కడ ఉన్న ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతి రూపంగా దర్శనమిచ్చింది అని చెబుతుంటారు. ఇలా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని గ్రామదేవతగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారు గ్రామదేవతగా ఉంటూ ఇక్కడి భక్తులను కాపాడుతుందని వారి విశ్వాసం. మరి ఈ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Maridamma Ammavari Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలో శ్రీ మరిడమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంది. అయితే 17 వ శతాబ్దం చివరలో పెద్దాపురంలోని మానోజి చెరువు సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలసినట్లు స్థానికుల ద్వారా తెలియుచున్నది.

ఆ కాలంలో ఇక్కడ ఉన్న చెరువు చుట్టూ పక్కల ప్రదేశం చిట్టడివిగా ఉండేది. ఒకసారి అడవి నుంచి పశువుల్ని తోలుకు వచ్చే కాపరులకు మనోజి చెరువు ప్రాంతంలో 16 ఏళ్ళ యువతి కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచును. నేను ఈ ప్రదేశంలోనే ఉన్నానని మా వాళ్లకు చెప్పండి అని చెప్పి అంతరార్థమైనది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు పరుగు పరుగున వెళ్లి చింతపల్లి వారికీ తెలియచేసారు.

Sri Maridamma Ammavari Temple

ఆ కుటుంబ సభ్యులు మానోజి చెరువు ప్రాంతంలో గాలించగా వారికీ పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతి రూపంగా దర్శనమిచ్చింది. ఆ గద్దెని అక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య దీపధూప, నైవేద్యాలు చెల్లించి ఆరాధించటం ప్రారంభించారు.

అయితే కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి ఆ గ్రామప్రజలను రక్షించు అమ్మవారుగా ఎన్నో నిదర్శనములు చూపించింది. ఇక పిలిస్తే పలికే తల్లిలాంటి ఈ అమ్మవారిని చుట్టూ పక్కల గ్రామాలవారు కూడా ఆరాధించటం ప్రారంభించారు. ఇంకా మహమ్మారి కలరా జాడ్యం నుండి రక్షించు దేవతగా మానోజి చెరువు గట్టున వెలసిన అమ్మవారు కాబట్టి ఈ తల్లిని మారెమ్మ అని కూడా పిలిచేవారు. ఆ తల్లే మరిడమ్మగా ప్రఖ్యాతి గాంచింది.

Sri Maridamma Ammavari Temple

ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో నెల రోజులపాటు ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ఎంతో వైభవముగా జరుగుతుంది. ఈ సమయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR