గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడే ఆలయం

గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.

గరుత్మంతుడుఅయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీకృష్ణ, శ్రీ రామ ఆలయాలు ఒకే దగ్గర ఉండి విడివిడిగా ధ్వజస్తంభాలు, బలిపీఠాలు ఉండటం విశేషం. ఇంకా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడుతూ ఉంటాయి. ఇలా గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడటానికి హనుమంతుడే కారణం అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? హనుమంతుడు గరుత్మంతుడి గర్వాన్ని ఎలా అణిచివేశాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గరుత్మంతుడుఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలకు మూలస్థానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు అనే గ్రామంలో అళగుమల్లరి కృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో జాంబవతి, సత్యభామ సమేత శ్రీ కృష్ణపరమాత్మ కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎంతో మనోహరంగా ఉండటం వల్ల ఇక్కడ కొలువై ఉన్న స్వామిని అళగుమన్నారు అని పిలిచారు. తమిళంలో అళగు అంటే అందం అని అర్ధం. ఇలాంటి విశేషంగల దేవాలయం ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనబడదు.

గరుత్మంతుడుశ్రీకృష్ణుడి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి ఎప్పుడు నీరు కారుతూ ఉంటుంది. దీని వెనుక ఒక పురాణం ఉంది, శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో జాంబవంతుడికి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడుని కూడా పిలుచుకు రమ్మని స్వామి గరుత్మంతుడిని పంపించాడు. తనంతటి బలశాలి లేడనే గర్వంతో గరుడుడు, హనుమంతుడి ధ్యానానికి భంగం కలిగించాడట.

గరుత్మంతుడుగరుత్మంతుడు రాముని మాట కోసం హనుమంతుని తీసుకురావడానికి వెళ్ళినపుడు హనుమంతుడు ధ్యానంలో ఉన్నాడు. రామనామ స్మరణకి భంగం కలిగించిన గరుడినిపై హనుమన్ కోపంతో చేయి చేసుకుంటాడు. అప్పటి వరకు గరుత్మంతుడు తనను తాను మహా బలశాలి తనంత శక్తి వంతులు లేరు అనుకునేవాడు. హనుమంతుడు కొట్టిన ఆ దెబ్బకి ఆయన ముందు తాను ఎంత బలహీనుడననేది గరుడినికి అర్థమైంది. ఆ తరువాత విషయం తెలుసుకున్న హనుమ ఆయనని అనుసరించి ఇక్కడికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒక చెంప వాచినట్టుగా ఉండి కంటి నుండి నీరు వస్తుంది అని స్థల పురాణం చెబుతుంది.

గరుత్మంతుడుఇక ఈ ఆలయంలో 9 అడుగుల ఎత్తు గరుత్మంతుని విగ్రహం, తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు జాంబవంతుడు, సుగ్రీవ జటాయువుల విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణ – జాంబవంతుల మధ్య మల్లయుద్ధం జరిగింది ఈ ప్రాంతంలోనే అని పురాణ ఇతిహాసం. ఈ ఆలయం 10 వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించినట్లు తెలియుచున్నది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో నిత్యపూజలు జరుగుతాయి. ప్రత్యేక రోజులలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,610,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR