జిందా తిలిస్మాత్ ఔషధాన్ని ఎవరు ఎలా తయారు చేసారో తెలుసా ?

0
360

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న దానికి హాస్పిటల్ ధారి పడుతున్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ ఇంట్లో ఉండే ఔషధాలతో వ్యాధులు నయం చేసుకునేవారు. అలాంటి ఇంటి ఔషధాలలో ముఖ్యమైనది జిందా తిలిస్మాథ్. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, తల తిరిగినట్టు ఉన్నా, లీటర్ మంచి నీటిలో మూడు చుక్కలు జిందా తిలిస్మాత్ వేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా జీర్ణ క్రియ సరిగా జరగడానికి కూడా సహాయాడుతుంది. కరోనా సమయంలో పేద,మధ్య తరగతి వాళ్లకు జిందా తిలిస్మాథ్ మంచి ఉపశమనంగా ఉపయోగ పడుతుంది. కరోనా సమయంలో ఇతర కారణాల వల్ల జలుబు చేసినా, జ్వరం వచ్చినా కరోనా అని భయపడే వారికీ జిందా తిలస్మాద్ ఉపశమనాన్ని ఇస్తుంది. ధర పేద వాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది.

Zinda Tilismathమరి ఇంత అద్భుతమైన ఔషధాన్ని ఎవరు? ఎలా తయారు చేసారో ఇప్పుడు తెలుసుకుందాం. నిజాం కాలంలో ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కి వలస వచ్చిన హకీమ్ మహ్మద్ ముజయుద్దీన్ ఫారూఖీ మొదట దీన్ని తయారు చేసారు. ఇది హైద్రాబాద్ లో మాత్రమే తయారు చేసే మందు. వ్యాపార దృక్పధంతో కాకుండా ప్రతి పేద వాడికి ఉపయోగ పడాలనే సదుద్దేశంతో ముజయుద్దీన్ తానే స్వయంగా రూప కర్త ,ప్రచార కర్తగా మరి జిందా తిలిస్మాథ్ గురించి ప్రచారం చేసాడు. దారిలో కనిపించే వారందరికీ ఉచితంగా పంచి పెట్టె వాడు. గోడల మీద ,గాలి పటాలమీద ముద్రించి కూడా ప్రచారం చేసాడు. ఇలా వంద ఏళ్ల నుండి జిందా తిలిస్మాథ్ మనకు సహాయపడుతుంది.

Zinda Tilismathజిందా తిలిస్మాత్ పైన నీగ్రో బొమ్మను ముద్రించడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అది ఏంటంటే నిజాం సైన్యంలో నీగ్రోలు చాల బలంగా ఉండే వారు. జిందా తాగితే అంత బలంగా తయారవుతారని గుర్తుగా నీగ్రో బొమ్మను వేశారు. ఇప్పటికీ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు రాష్ట్రాలలో జిందా తిలిస్మాథ్ కి మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు సైతం ఈ ఔషధాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఇక కరోనా సమయంలో జిందా తిలిస్మాథ్ డిమాండ్ మరింతగా పెరిగింది. కరోనా కి ముందు కంటే కరోనా సమయంలో పది శాతం ఎగుమతులు పెరిగాయి.

Zinda Tilismathఔషధాన్ని తయారు చేస్తున్న సంస్థకి ఒక సంవత్సరానికి 12 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే ఇప్పటికీ టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా యంత్రాలు వాడకుండా కేవలం చేతులతో జిందా తిలిస్మాథ్ తయారు చేయడం విశేషం. అది కూడా కేవలం 80 మంది సిబ్బందితో మాత్రమే సంస్థను కొనసాగించడం విశేషం.

SHARE