జంతువులకు నిర్మించిన విచిత్రమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?

భారతీయ తత్వాన్ని ప్రపంచ నలుమూలలు కీర్తిస్తున్నాయి అంటే ఆ గొప్పతనం మన సనాతన ధర్మానిదే. అందులో ముఖ్యమైన భాగం భక్తి. మన పురాణాలు, చరిత్ర అంతా ఎక్కువగా భక్తిపై, దైవత్వం మీద ఆధారపడి ఉంటుంది. భక్తి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఏ మాత్రం కష్టమొచ్చిన దేవుడిని భక్తితో ప్రార్థించాల్సిందే. ముఖ్యంగా సనతాన సంప్రదాయలకు ప్రాధాన్యతనిచ్చే మనదేశంలో భక్తి రోజురోజుకు కొత్త రూపాలు దాల్చుతుంది. ఎంతలా అంటే.. అవసరమైతే ఆలయాలను కట్టేంత.

Strange temples built for animalsదేవుళ్లకు గుళ్లు కడితే పర్వాలేదు.. కానీ ఇష్టమైన హీరోయిన్లు, రాజకీయ నాయకులు అంటూ రోజురోజుకో గుడిని నిర్మిస్తున్నారు. అంతే కాదండోయ్ కొన్ని చోట్లయితే ఇతర జీవులైన కప్ప, దోమ, ఎలుక ఆఖరుకు గబ్బిళానికి కూడా ఆలయాలు నిర్మిస్తున్నారు. జంతువులకు గుళ్లు ఏంటని ఆశ్చర్య పోనక్కర్లేదు. భయం-భక్తి ఉన్న మనుషులు ఈ రెండింటి కోసం ఎవ్వరికైన ఆలయాలు కట్టేస్తారు. మరి ఇంత వింత విచిత్రమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ జీవికి గుడి కట్టారో ఇప్పుడు చూద్దాం.

దోమకు గుడి :

Strange temples built for animalsదోమకు గుడి ఏంటని వినడానికి మనకు కొంచెం విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఇంతకీ ఈ గుడి ఎక్కడో లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. హైదరాబాద్ పరిసరప్రాంతంలో దీనిని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఓ డాక్టర్ నిర్మించారు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహాన కల్లించాలనే సదుద్దేశ్యంతో ఎం. సతీశ్ రెడ్డి అనే వైద్యుడు దోమకు ఆలయాన్ని కట్టారు. 2008లో నిర్మించిన ఈ మందిరానికి ఖర్చు 5 వేల రూపాయలు.

బ్యాట్ కేవ్(గబ్బిళాల గుహ) బాలీ :

Strange temples built for animalsబాలీ ప్రాంతంలో గబ్బిళాల కోసం బ్యాట్ కేవ్ ఉంది. అందులో గబ్బిళాలు నివాసముంటాయి. అక్కడున్న స్థానిక ప్రజల కథనం ప్రకారం ఆ గుహ కింద ఓ నది ఉంది. ఈ నదిలోని నీటిని గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో బాలిని దేవుడిగా పూజిస్తారు. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతం యాత్రికులతో కళకళాడుతుంటుంది. పగటి పూట గబ్బిళాలు కనిపించవు. లోపల గుహలో ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత గుహ నుంచి బయటకు వచ్చి కలయతిరుగుతాయి.

మండూకానికి(కప్ప) గుడి :

Strange temples built for animalsఉత్తర ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ జిల్లాకు చెందిన ఆయల్ లో కప్పకు ఆలయం నిర్మించారు. దేశంలో కప్ప గుడి ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇక్కడ కప్పలను పూజిస్తారు. మండూక తంత్రం ఆధారంగా ఈ గుడిలో శివాజీ కప్ప వెనకు భాగంలో కూర్చొని ఉంటారని అక్కడ ప్రజలు చెబుతారు. 200 ఏళ్ల నుంచి ఉన్న కప్ప మందిరాన్ని వరదలు, కరువు కటాకాలు నుంచి బయట పడేందుకు గాను నిర్మించారు. సాధారణంగా వర్షాలు పడకపోతే కప్పలను పూజిస్తారనే విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా ఆలయాల్లో నందీశ్వరుడు కూర్చొని ఉన్న విగ్రహాలను చూసుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత మాత్రం నంది నిలుచును ఉంటుంది. ఈ కప్ప ఆలయంలో శివ లింగం కూడా ఉంది. ఈ లింగం రంగు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుందట.

చుంచెలుకకు చిన్న కోవెల :

Strange temples built for animalsరాజస్థాన్ లోని బికనీర్ లో కర్ణి మాత గుడి ఉంది. ఈ ఆలయం ఎలుకలకు ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని చుంచెలుక కోసం నిర్మించారు. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు చుంచెలకకు పూజలు చేయాలని ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడకొచ్చే భక్తులు చుంచెలకలను దేవుడిలా భావించి బహుమతులు కూడా అందజేస్తుంటారు. ఇక్కడున్న ఎలుకలన్నింటికీ.. పూజలందుకుంటున్న చుంచెలుక తల్లి వంటిదని అక్కడ నమ్ముతారు.

బిహార్ లో గబ్బిళాలకు మరో మందిరం :

Strange temples built for animalsబ్యాట్ కేవ్ కాకుండా గబ్బిళాలకు మరొక ఆలయం కూడా ఉంది. బిహార్ లోని వైశాలీ జిల్లాలో ఈ గుడి ఉంది. ఈ ప్రాంతం పాట్నా, ముజఫర్ పుర్ కు మధ్యలో ఉంటుంది. గబ్బిళాలు ఎలాంటి హానికారకాలు కావని అక్కడున్న స్థానికులు గట్టిగా విశ్వసిస్తుంటారు. గబ్బిళాలకు ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ అక్కడున్న గ్రామస్థులు గబ్బిళాల వల్లే తామంత సురక్షితంగా ఉన్నామని బలంగా విశ్వసిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR