Home Entertainment ‘Goosebumps’ Is The Only Word To Describe Stupendous and Epic Trailer Of...

‘Goosebumps’ Is The Only Word To Describe Stupendous and Epic Trailer Of ‘NTR – Kathnayakudu’

0

విశ్వవిఖ్యాత, యుగపురుషుడు శ్రీ ‘నందమూరి తారక రామరావు’ గారు జీవిత కథ రూపంలో మన ముందుకు వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న ‘నందమూరి తారక రామరావు’ అనే సాధారణ మనిషిగా జన్మించి సినిమా రంగం మీద ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసారు ఎన్టీఆర్ గారు. అలా సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం వదిలి మద్రాసు ట్రైన్ పట్టుకుని సినిమా అవకాశాల కోసం బయలుదేరారు.

1 - ntr biopic

అలా సినిమాల్లో జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా రాముడు, కృష్ణుడు నుండి రావణుడు, దుర్యోధనుడు వరకు ఎన్టీఆర్ గారు కట్టని వేషం లేదు చేయని సినిమా లేదు. రాముడు, కృష్ణుడు వేషాల్లో ఎన్టీఆర్ గారిని చుసిన వారు ఎవరైనా రాముడు, కృష్ణుడంటే ఇలాగె ఉండేవారేమో అనేంతలా రామారావు గారి పాత్రలు ఉండేవి.

సాంఘికం, పౌరాణికం, జానపదం లాంటివి దాదాపు 320కి పైగా చిత్రాల్లో, పాత్రల్లో నటించి తెలుగు ప్రజల మనసు గెలవడమే కాదు ‘తెలుగు దేశం’ అనే పార్టీ స్థాపించి ఢిల్లీలో ఉన్న గుళముల దగ్గర సలాం కొట్టే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారు ఎన్టీఆర్ గారు.

క్రమశిక్షణకు మరో పేరుగా, తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీకగా, తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకంగా నిల్చిన మన ‘అన్నగారు, యుగపురుషుడు, శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని మన ముందుకు ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’ రూపంలో మన ముందుకు వస్తుంది.

కొన్ని నిమిషాల ముందు విడుదలైన ‘కథానాయకుడు’ ప్రసార చిత్రం (ట్రైలర్) చూస్తుంటే రోమాలు నిక్కపొడిచాయి. మనకు తెలిసి తెలియని చరిత్ర ఎదో మన కన్నుల ముందు కదిలినట్టుగా అనిపించింది ఈ ప్రసార చిత్రం చూస్తే. అన్నగారిని ఎలా చూపిస్తారో అన్న సందేహాల్ని ఈ ట్రైలర్ రేపు వెండి తెర మీద జీవిత చరిత్ర ఎలా ఉండబోతుందో అని చెప్పకనే చెప్పేసింది.

”జనం కోసమే సినిమా అనుకున్నాను.. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను..”

”60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లు మాకోసం బతికాం ఇక ప్రజల కోసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం”

”నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను”

”ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది. కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది”

Exit mobile version