రోజు రోజుకి షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకసారి షుగర్ ఎటాక్ అయింది అంటే తీపి వస్తువులకు పూర్తిగా దూరమైనట్టే. ఇక చక్కర గురించి మరిచిపోవాలి. అయితే షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే చక్కర ఒకటి ఉంది. దాన్ని షుగర్ ఉన్నవాళ్లు తినడమే కాదు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట. అదే కొబ్బరి చక్కర. దాన్నే కోకో సాప్ షుగర్ అని బ్లోసమ్ షుగర్ అని అంటారు. ఇండోనేషియా వంటలలో కొబ్బరి చక్కెరను గులా జావా (జావానీస్ షుగర్) లేదా గులా మేరా (రెడ్ షుగర్) అని పిలుస్తారు,
- సాధారణంగా చక్కెరను అధికంగా తినడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చక్కెరను అధికంగా తింటే అధికంగా బరువు పెరుగుతారు. దీంతో డయాబెటిస్, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. అయినప్పటికీ కొందరు నిత్యం చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. అయితే దానికి బదులుగా కొబ్బరితో తయారు చేసే కొబ్బరి చక్కెరను తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది. రుచిగా ఉంటుంది.
- కొబ్బరి చక్కెరను కొబ్బరికాండం నుంచి తీసిన ప్రత్యేక ద్రవంతో చక్కెరను తయారు చేస్తారు. అది రంగులో నల్లగా ఉంటుంది. అయినప్పటికీ సాధారణ చక్కెర కన్నా కొబ్బరి చక్కెర ఎంతో ఆరోగ్యకరమైంది. కొబ్బరి చక్కెరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని వంటలకు, బేకరీ పదార్థాలను తయారు చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో చక్కెర తింటున్నాం, క్యాలరీలు వస్తాయన్న బెంగ ఉండదు.
- కొబ్బరి చెట్టు రెమ్మల నుంచి తీపిరసం వస్తుంది. దీన్ని అధికారికంగా నీరా అని కూడా అంటారు. ఈ కొబ్బరికాయను ముక్కలుగా కోసి ఒక కుండలో వేలాడదీని ముందుగా రసం తీసి, ఆ తర్వాత మొలాసిస్‌ను తయారు చేసిన విధంగానే ఉడకబెట్టాలి. ఈ కణికలు సాధారణ చక్కెర వలె పెద్దవిగా లేదా మధ్యస్థంగా ఉండవు. ఇవి చాలా చిన్నవి. ప్రస్తుతం డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి చక్కెరను ప్రత్యామ్నాయంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
- సాధారణ చక్కెరలో కొన్ని సార్లు జంతు సంబంధ పదార్థాలు కలుస్తాయి. అవి తక్కువ మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ అవి మనకు హాని కలిగిస్తాయి. కానీ కొబ్బరి చక్కెరలో అలాంటివి ఏవీ ఉండవు. కనుక కొబ్బరి చక్కెరను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొబ్బరి చక్కెరలో పొటాషియం, మెగ్నిషియం, సోడియం వంటి అనేక ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అలాగే పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- బేకింగ్ కోసం కొబ్బరి చక్కెర బ్రౌన్ షుగర్ లాగా కనిపిస్తుంది. కానీ బ్రౌన్ షుగర్ కంటే భిన్నంగా ఉంటుంది. కొబ్బరి చక్కెరను మొలాసిస్ లాగా ఎక్కువగా తింటారు. ఇది కరగడానికి సాధారణ చక్కెర కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ షుగర్‌ను కాఫీ నుంచి టీ వరకు అన్నింటిలోనూ ఉపయోగించవచ్చు. కొబ్బరి చక్కెరలో ఉండే ఐనులిన్ అనే సమ్మేళనం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. అధిక బరువు తగ్గుతారు.
- సాధారణ చక్కెరతో పోలిస్తే కొబ్బరి చక్కెరలో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక మనకు పోషణ లభించడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరి చక్కెరలో ఉండే విటమిన్ సి, నైట్రోజన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. సాధారణ చక్కెర గ్లైసీమిక్ ఇండెక్స్ 65. కొబ్బరి చక్కెర జీఐ విలువ 35 మాత్రమే. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ చక్కెరను నిర్భయంగా వాడవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.