చిన్న పిల్లల్లో షుగర్ లక్షణాలు!

మధుమేహం, షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఏ పేరుతో పిలిచినా వ్యాధి ఒక్కటే.  ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. మన దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య పెరుగుతూనే వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకారి కానప్పటికీ.. షుగర్ మితిమీరితే ప్రాణాలకే ప్రమాదం. శరీరంలోని గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల ఈ వ్యాధి వస్తుంది.
అయితే  మన దురదృష్టం కొద్దీ ఈ వ్యాధి చిన్నారులకి కూడా పాకుతోంది. ఈ విషయం మనకు తెలియడం లేదు. చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో మనం దాన్ని గుర్తించట్లేదు. గతంలో పుట్టిన బిడ్డ కూడా ఈ వ్యాధితోనే పుట్టిన వార్తలు మనం విన్నాం. ఈ వ్యాధి ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లలకు కూడా వస్తుందనడంలో సందేహం లేదు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు.
చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు. ఈ వ్యాధి మొదటి లక్షణం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శరీర కణజాలాల నుండి నీటిని భారీగా గ్రహిస్తుంది. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగుతుంటే షుగర్ ఉన్నట్టు అనుమానించాలి.
షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. అధిక దాహం కారణంగా ఎక్కువ నీరు త్రాగటం వల్ల, బిడ్డకు తరచుగా మూత్రవిసర్జన మరియు విరేచనాలు అవుతాయి. ఆ విషయాన్ని గుర్తించాలి. చిన్నారులు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువగా జీర్ణశక్తి లోపించినప్పుడు అనుకుంటాం. కానీ, కొన్ని సార్లు షుగర్ వ్యాధి ఉన్నా కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు.
డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే. చిన్నారుల్లో కొన్ని స్పర్శ ఉండదు.. ముఖ్యంగా వారి కాళ్లు, చేతులకి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. దీన్ని గుర్తించాలి. లేకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి త్వరగా గుర్తించాలి.
కొంతమంది పిల్లలు ఎంత తిన్న మళ్ళీ ఆకలేస్తుంది అంటారు. అంతే కాదు బాగా నీరసంగా కూడా ఉంటారు. ఇది కూడా ఒక రకంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశానికి సంకేతం. దీనికి ప్రధాన కారణం శరీరంలోని కండరాలకు కావలసిన గ్లూకోజ్ తీసుకున్న ఆహరం నుండి పొందాలి. చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి, లేదంటే శరీరంలో లోపం ఉన్నట్టే. దీనివల్ల తీసుకున్న ఆహరం శరీరానికి ఉపయోగపడకపోవడం, పిల్లలు నిరసించి మళ్ళీ ఆకలేస్తుందని అని అంటారు.
మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం. చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే చిన్నారులు అందరికీ ఈ లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉంటుంది. దాన్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందిగా మారుతుంది.
సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
ఇందులో జన్యుపరమైన, పర్యావరణ లోపాలు కారణం కావొచ్చు. టైప్ 1 డయాబెటిస్ అనబడే  మెల్లిటిస్ దగ్గరి బంధువులలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గరి బంధువులకు ఎవరికైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4 శాతం పిల్లలకి వస్తుంది. ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4 శాతం వరకు వస్తుంది. అదే విధంగా ఒక వేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8 శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR