Home Unknown facts వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన అద్భుత ఆలయం

వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన అద్భుత ఆలయం

0

ఈ ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివలింగానికి, ఆలయ గోపురానికి, నంది విగ్రహానికి ఇలా ప్రతి దానికి ఒక విశేషం ఉంది భక్తులని ఆకట్టుకుంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ఆలయం అయినా ఈ గుడి ఎక్కడ ఉంది? ఆ గుడిలోని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1000 Years Ago temple

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఈ బృహదీశ్వరాలయం ఉంది. ఇది అతి ప్రాచీన పురాతన శివాలయం. ఈ ఆలయంలో ఉన్న బృహదీశ్వర స్వామి, పెద్ద నాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్పకళ అధ్బుతం. ఈ ఆలయ నిర్మాణాన్ని 11 వ శతాబ్దంలో చోళ రాజు అయినా రాజరాజ చోళుడు అత్యంత అధ్బుతంగా నిర్మించాడు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింబడినది.

ఈ ఆలయంలో, 13 అంతస్తులు ఉన్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతితో శిఖరాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువు ఉన్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లరనేది ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ విషయం. ఇంకా గర్భగుడిలోని శివలింగం ఏకశిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాలా విశాలమైనవి. ప్రకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు.

ఈ బృహదీశ్వరాలయం ఒక పెద్ద కోటలో ఉంది. ఆలయానికి ముందుభాగములో నల్ల రాతితో చెక్కిన బ్రహాండమైన నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం సుమారు 19 అడుగుల పొడవు,8 అడుగుల వెడల్పు,12 అడుగుల ఎత్తు,25 టన్నుల బరువు ఉంటుంది. అందుకే భారతదేశములోని అతిపెద్ద నంది విగ్రహాలలో మొదటిది లేపాక్షి లోని నంది అయితే రెండవ అతి పెద్ద నంది ఇదే అని చెప్పుతారు. నంది విగ్రహం దాటినా తరువాత కొంతదూరంలో ఆలయం ప్రారంభమవుతుంది.

ఇక గర్బాలయంలో ఉన్న శివలింగం అధ్భూతంగా పూర్తిగా నల్ల రాయితో చేయబడిన పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టబడిన మెట్లు ఉన్నాయి. ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కిన శిలకోసం ఎన్నో చోట్ల వెతికి చివరకు నర్మదానదీ గర్భములో నుండి సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ శిలను వెలికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి తానే స్వయంగా దగ్గర ఉండి 64 మంది శిల్పులతో ఆ శిలని శివలింగంగా మలిచి ఏనుగుల చేత మోయించుకొని వచ్చాడంటా.

అంతేకాకుండా గర్బాలయం పైన ఉన్న విమానం మొత్తం పద్నాలుగు అంతస్థులతో,రెండు వందల పదహారు అడుగుల ఎత్తు ఉంది. అందుకే ప్రపంచములోని దేవాలయ శిఖరాలలో ఇదే ఎత్తయిన శిఖరం అని అంటారు.

బృహదీశ్వరుని ప్రధానాలయానికి అనుకోని వెనుకగా కుమారస్వామి ఆలయం ఒకటి ఉంది. ఇది పూర్తిగా నల్ల చలువ రాయి తో నిర్మించబడింది. నలభై ఐదు అడుగుల చదరములో, యాభై అయిదు అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయంలోని ప్రతి అంగుళము అతి సూక్ష్మమైన నగిషీలు అపురూపంగా చెక్కబడి ఉన్నాయి.

అయితే 13 అంతస్థుల బృహదీశ్వరాలయం గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోపురం పైన 108 భరతనాట్య భంగిమలు చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఆగ్నేయములలో రెండు విగ్నేశ్వర విగ్రహాలున్నాయి. వీటిని మీటితే ఒకటి రాతిమోత, మరొకటి కంచుమోత వినిపిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో 252 శివలింగాలు ప్రతిష్టించినట్లు తెలియుచున్నది.

ఇలా ప్రతిదీ ఎంతో విశేషం ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు.

Exit mobile version