నోటి దుర్వాసనకు గల ఆశ్చర్యకరమైన కారణాలు ఏంటి ?

ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య.నోటి దుర్వాసన ఇన్ఫెక్షన్. ఈ సమస్య వళ్ళ చాల మంది ఇబ్బంది పడుతున్నారు. నలుగురిలో దగ్గరగా నుంచొని మాట్లాడలేకపోతున్నారు. దీంతో బాధ భరించలేక చాలా మంది డాక్టర్‌ను ఆశ్రయిస్తుంటారు.కానీ తీరిక లేకపోవడం వల్ల హాస్పిటల్‌కు వెళ్లడం కుదరకపోయిన వారు. ఈ సమస్య రావడానికి కారణాలు తెలుసుకొని జాగ్రత్త పడండి.

surprising causes of bad breathబ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం(బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం):

ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది మీ కడుపుకు లేదా మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది. మరియు నోటి దుర్వాసనకు కారణం అయ్యే మీ నాలుక మీద ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది.

లివర్ ప్రాబ్లమ్స్(కాలేయ సమస్యలు):

Health Benefits of Drinking Hibiscus Teaకాలేయానికి సంబంధించిన ఫ్యాటీ లివర్ లేదా కామెర్లు వంటి కాలేయ సమస్యలు కూడా మీ నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. క్రొవ్వు జీవక్రియల బాధ్యత కాలేయానిదే. ఎప్పడైతే ఈ బాద్యత కాలేయం వహించదో అప్పడు నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దాంతో నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

మౌత్ అల్సర్(నోటి పూత):

5 Mana Arogyam 3నోటిపూత వల్ల పళ్ళు పుచ్చిపోవడం, మరియు నోట్లో గాయాలేర్పడటం జరుగుతుంది . నోటి అల్సర్ వల్ల గాయాలేర్పడ్డ ప్రదేశం నుండి రక్తం లేదా చీము రావడం జరగవచ్చు. ఇలా తరుచూ బాధిస్తుంటే కనుక ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

చిగుళ్ళ నుండి రక్తస్రావం:

surprising causes of bad breathమీకు చిగుళ్ళు నుండి రక్తస్రావం జరుగుతుంటే అప్పుడు అది నోట్లో పేరుకుని ఉండిపోవడం వల్ల మీ శ్వాస చెడుగా ఉంటుంది. అదే నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నొప్పి) :

surprising causes of bad breathఎప్పుడైతో గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారో అప్పుడు కొన్నిబ్యాక్టీరియాలు శ్వాసవాహిక యొక్క కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో మ్యూకస్ ఫ్యూయల్ స్మెల్ వస్తుంది.

కిడ్నీ ఫెయిల్యూర్:

surprising causes of bad breathమూత్రపిండాలు పాడైతే..నోటిదుర్వాసనకు ఇది ఒక ప్రధాన మెడికల్ రీజన్. ఇది మీ నోటిని చేపల వాసన వచ్చేలా చేస్తుంది.

డైట్:

మీరు కనుక అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకుంటున్నట్లైతే అవి ఖచ్చితంగా నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. ఎందుకంటే వాటిలో ఉండే అమినోయాసిడ్స్ నోటిలో బ్యాక్టీరియా ఏర్పటు చేస్తుంది.

మద్యపానం సేవించటం:

surprising causes of bad breathఅధికంగా మద్యపానం సేవించడం వల్ల సేలవెరీ గ్లాండ్స్ పొడిబారడం జరుగుతుంది. ఈ గ్రంధులు నోటి దుర్వాసనకు కారణం అయ్యే నోటిలోని బ్యాక్టీరియాను శుభ్రపరచడానికి క్లియర్ చేయడానికి సహాయపడుతాయి. కాబట్టి తగినంత సలివ గ్రంథులు లోపిస్తే తప్పకుండా నోటి దుర్వాసన పాలు కావాల్సి ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR