Home Unknown facts అమ్మవారికి హారతి ఇచ్చే సమయానికి ఎలుగుబంట్లు వచ్చే ఆలయం

అమ్మవారికి హారతి ఇచ్చే సమయానికి ఎలుగుబంట్లు వచ్చే ఆలయం

0

మన పురాణాల ప్రకారం దేవతలకి వాహనంగా ఒక్కో దేవుడికి ఒక్కో జంతువు వాహనంగా ఉంది. అయితే మనం సాధారణంగా ఏదైనా ఆలయానికి పాములు, కోతులు రావడం చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సరిగ్గా సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చే సమయానికి నాలుగు ఎలుగుబంట్లు అనేవి వస్తున్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇలా ఈ ఆలయంలో ఎందుకు జరుగుతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

4 Bears Are Visiting This Temple

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో, మహాసముంద్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన చండీమాత ఆలయం ఉంది. ఆ అమ్మవారి ప్రసిద్ధ దేవాలయంలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చే సమయానికి నాలుగు ఎలుగుబంట్లు అనేవి వస్తున్నాయి. ఇలా ఇవి ఈ ఆలయానికి రావడం ఇది కొత్త కాదని ఎప్పటినుండి అవి సరిగ్గా హారతి సమయానికి సాయంత్రం ఆలయానికి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

అయితే హారతి సమయానికి వచ్చిన ఎలుగుబంట్లకి పూజారి పూజ చేసిన తరువాత అమ్మవారి ప్రసాదం భక్తుల కంటే ముందుగా వీటికి పెట్టి ఆ తరువాతే భక్తులకు ప్రసాదాన్ని ఇస్తుంటాడు. ఇక అక్కడి వచ్చిన భక్తులు కూడా వారు తీసుకువచ్చిన ప్రసాదాన్ని ఎలుగుబంట్లకి సమర్పిస్తుంటారు. సాధారణంగా ఎలుగుబంటి అంటే అందరికి భయం ఉంటుంది కానీ ఇక్కడికి వస్తున్న ఆ నాలుగు ఎలుగుబంట్లు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కరికి కూడా ఎలాంటి హాని చేయకుండా హారతి సమయానికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లిపోతుంటాయి.

ఇక స్థానిక భక్తులు అవి జంతువులు కావు అని అమ్మవారి స్వరూపాలని కొందరు, అమ్మవారిని నమ్మిన బంట్లు అని కొందరు, ఎంతో పవిత్రమైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని వారే ఎలుగుబంట్ల రూపంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని చెబుతుంటారు.

అయితే ప్రతి రోజు హారతి సమయంలో వచ్చే ఈ నాలుగు ఎలుగు బంట్లు కూడా ఈ ఆలయం దగ్గర మాత్రమే అవి వచ్చినప్పుడు కనిపిస్తాయని, ఆ తరువాత అడవుల్లో వెళ్లిన ఇప్పటి వారికి అడవుల్లో ఉండే గిరిజనులకు ఇప్పటివరకు అవి ఒకసారి కూడా కనిపించలేదని ఇదంతా ఆ అమ్మవారి మహత్యం అని, ఎలుగుబంట్లను కూడా దైవంగా భావిస్తుంటారు.

Exit mobile version