ఇంద్రలోకం నుండి శ్రీకృష్ణుడు తీసుకువచ్చిన పారిజాత వృక్షం

0
3841

శ్రీ కృష్ణుడు పారిజాత పుష్పాన్ని ఇంద్రలోకం నుండి తీసుకువస్తూ ఇక్కట్లు పడ్డాడని దానికి ఆధారంగానే పారిజాతాపహరణం అనే కథ ఉందని పురాణం. మరి శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని ఎందుకు తీసుకువచ్చాడు? ప్రస్తుతం పారిజాత వృక్షం ఎక్కడ ఉంది? ఆ వృక్షం గొప్పతనం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Krishna

శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఇంద్రలోకం నుండి తీసుకువచ్చి సత్యభామకు ఇచ్చాడని పురాణం. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది.

Sri Krishna

పారిజాత వృక్షం విషయానికి వస్తే, ప్రపంచంలో కెల్లా ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి మరి చెప్పారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. ఈ చెట్టు కింది భాగంలో చెట్టు ఆకులూ చేతి ఐదు వేళ్ళని పోలి ఉంటాయి, ఇంకా పై బాగానే ఆకులూ ఏడు భాగాలుగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క పూలు ఐదు రేకులు కలిగి ఉంటాయి.

Sri Krishna

ఈ వృక్షం జూన్ – జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ చెట్టు యొక్క పూలు బంగారు, తెలుపు రంగులో చాలా అందంగా ఉంటాయి. వీటి సుహాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయసు దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుండి ఐదు వేల సంవత్సరాలు. వృక్షం యొక్క కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ఈ వృక్షం యొక్క విశేషం ఏంటంటే, ఈ చెట్టు యొక్క శాఖలు, ఆకులూ కుచించుకుపోయి కాండంలో కలసిపోవడమే కానీ ఎండిపోవడం, రాలిపోవడం లాంటివి జరగవు.

Sri Krishna

పారిజాత పుష్పాలతో దేవతలకి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. దీనిలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈవిధంగా అన్ని రకాలుగా ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకి లేని ప్రత్యేకత ఈ పారిజాత వృక్షానికే స్వంతం అని చెబుతుంటారు.