ఈ ఆలయం ఉన్న ఊరిలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు ఎందుకు ?

0
2528

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలుచుకోరు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందని అంటారు. మరి శనిదేవుడు స్వయంభువుగా వెలసిన ఈ ఆలయం ఉన్న ఊరిలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు ఈ ఊరిలో ఇంటికి తలుపులు ఉండవనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shani Shinganapur Temple

మహారాష్ట్ర, షిరిడి కి 60 కిలోమీటర్ల దూరంలో శింగణాపూర్ గ్రామంలో శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడ శని దేవుడికి ఆలయం అంటూ ఉండదు. ఒక పెద్ద శిల లింగరూపంలో వెలసి ఉన్నది. ఇక్కడ శనిదేవుడు స్వయంభువుగా వెలిశాడని ఇది శనిదేవుడి నివాసప్రాంతంగా చెబుతారు. ఇక ఎక్కడ వెలసిన ఈ నల్లని రాతి విగ్రహం ఏ కాలానికి చెందినది అనేది సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు.

Shani Shinganapur Temple

ఇలా శనిభగవానుడు పెద్ద స్థంభం లాగా శివలింగం వలె ఉండే నల్లరాతి విగ్రహం దాధాపుగ ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహానికి మగవారు మాత్రమే పూజలు చేయాలనే ఒక నియమం ఉండేది. ఆడవారికి ఇందులోకి ప్రవేశం అనేది లేదు. ఇలా గర్భగుడిలోకి ఆడవారికి ప్రవేశం లేదని కొందరు కోర్టుని ఆశ్రయించగా చివరగా 2016 లో గర్భగుడి ప్రవేశానికి అంగీకారం లభించింది.

Shani Shinganapur Temple

ఇక ఈ గ్రామంలో విశేషం ఏంటంటే, ఏ ఇంటికి కూడా తలుపులు అనేవి ఉండవు, వాహనాలకు కూడా తాళం అంటూ వేయరు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగగకుండా ఆ శని దేవుడి వీరిని రక్షిస్తాడని గ్రామస్థులు నమ్మకం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ దొంగతనం చేస్తే వారికీ ఆ రోజే ఆ శనిభగవానుడు శిక్షిస్తాడని, గుడ్డివారవుతారని నమ్మకం. అందుకే వాహనాలకు, ఇంటికి ఈ గ్రామస్థులు తాళం వేయకూడదనే ఒక నియమం ఉంది.

Shani Shinganapur Temple

ఇక శనిదేవుడికి నలుపు రంగు ఇష్టమని, భక్తులు నల్లని వస్త్రాలు ధరించి శనిదేవుడిని దర్శనం చేసుకుంటారు. ఇంకా ఇక్కడ శనిదేవుడి ఆలయానికి ఎదురుగా మహాలక్ష్మి అమ్మవారి గుడి అనేది ఉండటం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

SHARE