Suryanandhi kshetram ani piluvabade shri maathaa manikeshwari aalayam

0
7494

ఈ అమ్మావారు ఒక గుట్టపైన వెలిశారు. ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.suryanandhi తెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట మండలం, నారాయణపేటకు సమీపంలో కర్ణాటక సరిహద్దులో మాణిక్యగిరి అనే గ్రామంలో శ్రీ మాతా మాణిక్యేశ్వరి అమ్మ దివ్యక్షేత్రం ఉంది. దీనిని సూర్యనంది క్షేత్రం అని కూడా పిలుస్తారు. యనగుంది గుట్టపై ఉన్న ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. suryanandhiప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన దర్శనమిచ్చే అమ్మవారి సన్నిధికి లక్షలాది మంది భక్తులు మాణిక్యగిరి కొండకు తరలివచ్చి పులకరించిపోతారు. ఈ మాణిక్యగిరి కొండపై శివాలయం, శ్రీ వెంకటేశ్వరాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, బ్రహ్మ, అంబాభవాని ఆలయం ఆంజనేయస్వామి ఆలయం, సిద్దేశ్వర, గణపతి, పార్వతి దేవాలయాలను నెలకొల్పారు. అంతేకాక గుట్ట కింద భాగంలో దత్తాత్రేయ, ఆంజనేయ, బసవన్న ఆలయాలను నిర్మించారు. suryanandhiఈ ఆలయానికి ప్రధానంగా గ్రహపీడల నుండి దీర్ఘ రోగాలనుండి విముక్తి పొందాలనే కోరికలతో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ప్రతినిత్యం భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ప్రధానంగా మధుమాంసాలు విడనాడాలని అమ్మవారు బోధిస్తుంటారు. suryanandhiపురాణ విషయానికి వస్తే, మల్లాబాద్ లో ఆశమ్మ, బుగ్గప్పల కుమార్తెగా మాణిక్యమ్మగా అమ్మవారు జన్మించారు. బాల్యదశ నుండే అమ్మవారు ధ్యానానిస్టిలోనే ఎక్కువగా కాలం గడిపేవారని తెలియుచున్నది. బుగ్గప్పది నిరుపేద కుటుంబం కావడంతో మాణిక్యమ్మ పశువులను మేపడానికి అడవికి వెళ్లి అక్కడ నిత్యం ధ్యానం, తపస్సుతోనే కాలం గడిపేవారు. చివరకు 1950 లో యనగుంధిలోని రాందేవుని గుడిలో కొంతకాలం పాటు ఉండి, సిద్దేశ్వర గుట్టపై ఒక శివాలయాన్ని నిర్మించి, ఆ పరమేశ్వరునికి మొదటిసారిగా నీటితోనే దీపాలను వెలిగించి తన మహిమను చాటుకున్నది. యనగుంధిలో ఆశ్రమాన్ని నెలకొల్పిన తరువాత ఒకనాడు అమ్మవారు అదృశ్యమై శ్రీశైలంలో ప్రత్యేక్షమై భక్తులకు దర్శమిచ్చారు. suryanandhiఇలా ఇక్కడ వెలసిన అమ్మవారిని వేలాదిమంది భక్తులు విచ్చేసి వారి కోరికలను కోరుకుంటూ మాతా మాణిక్యేశ్వరిని దర్శించుకొని ధన్యులవుతున్నారు. suryanandhi