వృద్ధ దంపతులకు స్వామివారు కళ్ళు ప్రసాదించిన పుణ్యస్థలం

0
7300

ఇక్కడి ఆలయంలో భక్తులు మొదటగా వృద్ధ దంపతులను పూజించి ఆ తరువాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో భక్త కోటేశ్వరస్వామి పూజలందుకుంటున్నాడు. మరి ఈ ఆలయంలో వృద్ధ దంపతుల ప్రతిమ శిలలు ఎందుకు ఉన్నాయి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? బత్తినయ్య అంటే ఎవరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

koteshwaraswamiఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలోని తాలూకా తొండమనాడు గ్రామానికి సమీపంలో బత్తినయ్య కోన అనే కోటేశ్వరస్వామివార్ల పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు అనేదానికి ఒక కథ వెలుగులో ఉంది.

koteshwaraswamiపూర్వం బత్తినయ్య అనే ఒక మహాపురుషుడు ధనికొండపై కొంతకాలం తపమాచరించాడు. ఆ తరువాత అయన శ్రీకాళహస్తిని తిరుమలలో వేంకటేశ్వరస్వామిని సేవించి, శ్రీకాళహస్తి చేరి, సమీపంలో ఉన్న అగస్తేశ్వర పర్వతాలను మూడు అంగుళాలలో చేరాడట. అందుకు నిదర్శనంగా ముసలిపేడు అనే గ్రామం వద్ద చెరువు గట్టున ఒక పాదం, మొనగాడి గుంత అనే ప్రదేశంలో మరోపాదం, కొండగుహ వద్ద మరోపాదం గుర్తులు నేటికీ స్పష్టంగానే కనిపిస్తుంటాయి. ఈ పాదాల గుర్తులను భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

koteshwaraswamiఅయితే బత్తినయ్య ఆ కొండగుహలో తపస్సులో లీనమైపోయాడు. ఈవిధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. అతని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. ఆలా పుట్టపైన చుట్టూ చెట్లు తీగలు పెరిగాయి. అయినా బత్తినయ్య స్వామివారు తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు.

koteshwaraswamiఇది ఇలా ఉంటె ఒకరోజు గ్రామంలో నివసించే యానాది దంపతులు తేనే, దుంపలు తీసుకురావడానికి వెళ్లి దారితప్పి బత్తినయ్య ఉన్న గుహ ప్రదేశానికి వచ్చారు. అక్కడ వారికీ దుంపలు లభించడంతో కొన్ని రోజులు వాటిని తింటూ అక్కడే నివసించారు. కొంతకాలం తరువాత ఒక రోజు పెద్ద వర్షం కురవడంతో బయటకి వెళ్లలేక ఆ గుహలో పుట్టలోపల పెరిగిన దుంపలను తవ్వడానికి ప్రయతింస్తుండగా పుట్టలో ఉన్న బత్తినయ్య తలకి దెబ్బ తగిలి రక్తం చిమ్మింది. అప్పుడు వెంటనే దెబ్బకు కారణం అయినా ఆ వృధ్దిడి కళ్ళు పోయాయి.

koteshwaraswamiఆ వృద్ధ దంపతులు వారికి జరిగిన అన్యాయం గురించి ఏడుస్తుండగా పుట్టలో నుండి ఓం నమఃశివాయ అని వినిపించింది. అప్పుడు వృద్ధ దంపతులు స్వామి మేము తెలియక చేసిన తప్పు అందుకు క్షమించండి అని వేడుకోగా, ఆ స్వామి కరుణించి కళ్ళు వచ్చేలా చేసాడు.

6 battinayya konalo velasina koteshwaraswamivarla punyakshetramఅతనికి చూపుని ప్రసాదించిన తరువాత, నన్ను భక్తకోటేశ్వరుడు అంటారు. నేను కలియుగంలో భక్తుల కోర్కెలు తీర్చడానికి ఇక్కడ లింగరూపంలో అవతరిస్తాను. ఈ విషయం మీరు కొండ దిగి వెళ్లి గ్రామంలోని ప్రజలకు తెలియజేయండి అని చెప్పాడు. అప్పుడు వారు వెళ్లి గ్రామస్థులకు తెలియచేయగా అందరు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆవిధంగా వృద్ధ దంపతులు జీవితాంతం స్వామిని సేవిస్తూ కొంతకాలం తరువాత ఆయనలో లీనమైపోయారు. అప్పటినుండి స్వామి దర్శనమై వచ్చే భక్తులు మొదటగా వృద్ధ దంపతులని పూజించి ఆ తరువాత ఆయనను పూజించాలని చెప్పారట, అందుకే స్వామి చెంత వృద్ధ దంపతుల శిలాప్రతిమలు నేటికీ పూజలందుకుంటున్నాయి.

7 battinayya konalo velasina koteshwaraswamivarla punyakshetramఈవిధంగా వెలసిన భక్తకోటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

8 battinayya konalo velasina koteshwaraswamivarla punyakshetram