బంగారం దొరికే స్వర్ణరేఖ నది!! ఎక్కడంటే..?

శివుని జటాజూటం నుండి జాలువారే పవిత్ర గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది.  “గంగమ్మ తల్లి” అనీ, “పావన గంగ” అనీ, “గంగా భవాని” అనీ ఇలా ఎన్నో పేర్లతో గంగా నదిని హిందువులు స్మరిస్తారు. “నీరు” అన్న పదానికి సంస్కృతంలో “గంగ” అన్న పదాన్ని వాడుతారు.  గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది.
  • మన దేశంలో గంగానది ఎన్నో రకాల ప్రత్యేక గుణాలను కలిగి ప్రపంచంలో మరే నదికి లేనటువంటి విశిష్టతలను ఆ నది కలిగివుంది. సామాన్యంగా అన్ని నదులలో ఇసుకరేణువులు వుంటాయి. కానీ ఈ నదిలో మాత్రం ఇసుకరేణువులుతో పాటు బంగారు రేణువులు కూడా వుంటాయి. ఏంటి తమాషా చేస్తున్నాననుకోకండి. ఇది నిజమే.
  • కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ బంగారం అనేది లభిస్తుంది. అయితే ఇసుక రేణువులలో బంగారం లభించడం అనే దానికి ఖచ్చితమైన ప్రమాణాలు అనేవి ఏవీ లేవు. కానీ వైజ్ఞానికపరమైన కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ నది అనేక రకాలైన కొండలు, పర్వతాలు దాటుతూ వస్తుంది కాబట్టి ఆ సంఘర్షణ వల్ల  బంగారురేణువులు ఉత్పన్నం అయివుంటాయని భావిస్తున్నారు. మరి ఈ నది ఎక్కడ వుంది? దాని వివరాల గురించి తెలుసుకుందాం…
  • ఈ నది జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమబెంగాల్ లో ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కేవలం ఈ నదిలో మాత్రమే ఇలాంటి బంగారురేణువులు లభిస్తాయి. ఆ నదిని స్వర్ణరేఖ, సువర్ణ రేఖ అని కూడా అంటారు.
  • చేపల కోసం కాకుండా బంగారం కోసం వలలు వేస్తూ వుంటారు. దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే పూర్వకాలంలో భారతదేశాన్ని సోనీకిచిడా అని పిలిచేవారు.
  • మన దేశంలో ఎన్నో పవిత్రనదులు, జీవ నదులు వున్నాయి. జీవాధారానికి ప్రాణం పోసే నీరు ఈ నదులద్వారానే లభ్యమౌతున్నాయి. ఈ స్వర్ణ రేఖని అక్కడి ఆదిమవాసులు నందా అని పిలుస్తారు.
  • అక్కడి ఆదివాసులు బంగారంకోసం నదిలోని ఇసుకను మొత్తం జల్లెడ పట్టేస్తారు. వారి జీవితాలు అందులోని బంగారాన్ని వెలికితీయడంలోనే వేల సంవత్సరాలుగా  గడుస్తూ వున్నాయి. ఇక వీరు ఈ బంగారాన్ని లోకల్ వ్యాపారులకు అమ్మివేస్తారు. అయితే వీరి ద్వారా కోట్లు గడిస్తున్న వ్యాపారులు మాత్రం వీరికి మాత్రం కొంత మొత్తాన్ని మాత్రమే అప్పజెప్పుతారు. ఇక జార్ఖండ్ లోని రాజధానియైన రాంచికి 15కి.మీ ల దూరంలో స్వర్ణరేఖ నది ప్రవహిస్తుంది. రత్నగర్భ అనే ప్రాంతంలో ముఖ్యంగా ఈ బంగారు రేణువులు అనేవి లభ్యంఅవుతాయి.
  • హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం.
  • చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR