Home Unknown facts Swethavarna Roopamlo darshanamichhe hanumanthudu

Swethavarna Roopamlo darshanamichhe hanumanthudu

0

ఆంజనేయస్వామి వెలసిన ఆలయాలలో ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఈ ఆలయంలో శ్వేతవర్ణ రూపంలో దర్శనమిచ్చే హనుమంతుడిని దర్శిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని శాస్రాలు చెబుతున్నాయి. మరి ఎంతో మహిమ గల ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. swethavarnaతెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ కి 5 కి.మీ. దూరంలో ఎల్లారెడ్డి గూడలో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా విరాజిల్లుతుంది. ఆంజనేయస్వామి ఇక్కడ శ్వేతవర్ణ రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు, అకాలమరణాలు, ఈతిబాధలు తొలిగిపోయి మానసిక ప్రశాంతత కలగడమే గాక శనిపీడ వలన వచ్చే వ్యాధులు తగ్గుముఖం పడతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ వెలసిన స్వామికి నిత్య అభిషేకాది అర్చనలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఆకుపూజలు, సింధురపూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా హనుమజ్జయంతిని ఇచట చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఆంజనేయుడు కాగా మరికొంతమంది దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఆలయానికి నైరుతి భాగంలో గణపతి, వాయువ్య భాగం నందు సుబ్రహ్మణ్యస్వామి, పశ్చిమ భాగం నందు శివపంచాయతనం, నైరుతి భాగాన నాగదేవత, ఈశాన్య భాగంలో నవగ్రహాలు, శ్రీ అయ్యప్ప స్వామి మొదలగు ఆలయాలు భక్తులకి దర్శనమిస్తాయి. ఇక్కడ శ్రీరామనవమి, వినాయకచవితి, అయ్యప్ప జన్మదినోత్సవం, మహాశివరాత్రి వంటి పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా కార్తీకమాసంలో విశేష పూజలు, జపాలు ఘనంగా జరుగుతాయి. అంజనేయస్వామి శ్వేతవర్ణ రూపంలో కనిపించే ఈ ఆలయానికి భక్తుల రద్దీ అనేది ఎప్పుడు అధికంగా ఉంటుంది.

Exit mobile version