నోరోవైర‌స్ సోకినా వారికీ కనపడే లక్షణాలు ఏంటి ?

మానవాళికి మనుగడ లేకుండా చేస్తున్నాయి వైరస్లు. ఒకదాని తరువాత ఒకటి ఊపిరి పిల్చుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంటే.. మంకీ బీ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వీటికి తోడు మరో కొత్త నోరావైరస్.. వణుకుపుట్టిస్తోంది. చైనాలో మంకీ బీ వైరస్ కారణంగా ఒక మరణం నమోదైందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. యూకేలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది.

Symptoms Of a Norovirus Infectionఇప్పటికే కరోనా వేరియంట్లతో సతమతం అవుతుండగా… యూకేలో తాజాగా నోరా వైరస్ కేసులను గుర్తించింది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్. మే చివరి నుంచి నమోదైన కేసులను లెక్కేస్తే.. 154 నోరా కేసులు బయటపడ్డాయి. రోజురోజుకు ఈ కేసులు పెరుగుతుండడం.. ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు నిపుణులు. కరోనా నుండి పూర్తిగా కోలుకోక ముందే నోరా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో కలవరం మొదలైంది.

Symptoms Of a Norovirus Infectionఇది కూడా వ్యాపించే స్వభావమున్న వైరస్ కావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీన్ని వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఈ నోరోవైర‌స్‌నే స్ట‌మ‌క్ ఫ్లూగా పిలుస్తుంటారు. ఫుడ్ పాయిజ‌నింగ్, స్ట‌మ‌క్ బ‌గ్ అంటారు. నోరో వైరస్ సోకితే.. వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొంద‌రికి నోరోవైర‌స్ సోకినా ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు కనిపించవట..

Symptoms Of a Norovirus Infectionనోరో వైర‌స్‌.. ఆహారం ద్వారా వ్యాపిస్తోందనట. ఈవైర‌స్ సోకితే.. 12 నుంచి 48 గంట‌ల్లో తీవ్ర‌మైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ల‌క్ష‌ణాలు బయటపడతాయి. ఒక‌టి నుంచి మూడు రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైర‌స్ బారిన పడ్డవారిలో మ‌లం, వాంతిలో నోరోవైర‌స్ ఉంటుంది. వైరస్ లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. మ‌లాన్ని ప‌రీక్షించ‌డం ద్వారా కూడా వైర‌స్ ను గుర్తించే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా లేదా రోగ నిరోధ‌క‌శ‌క్తి త‌క్కువగా ఉన్నవారి మ‌లాన్ని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు.

Symptoms Of a Norovirus Infectionఏ కొంచెం శరీరంలోకి వెళ్లినా వైర‌స్ సోకుతుంది. క‌లుషిత‌మైన నీళ్లు, ఆహారాన్ని సిద్ధం చేసే ముందు స‌రిగా క‌డ‌గ‌క‌పోతే.. అక్కడ ఈ వైర‌స్ విజృంభించే అవకాశం ఉంటుంది. బావిలోని క‌లుషిత నీటిని తాగినా వైర‌స్ వ్యాపిస్తుంది. క‌లుషిత‌మైన ఆహారం, ద్ర‌వాల‌ ద్వారా ఈ వైర‌స్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన ఏదైనా వ‌స్తువు, ఉప‌రిత‌లాన్ని తాకి అదే చేతితో నోటిని తాకిన‌ప్పుడు వైర‌స్‌ వ్యాపిస్తుంది. ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తితో ఆహారం షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే వారు వాడిన పాత్ర‌ల‌ను వాడ‌టం వ‌ల్ల కూడా ఈ వైర‌స్ బారిన ప‌డ‌వ‌చ్చు.

Symptoms Of a Norovirus Infectionనోరా సోకిన వ్య‌క్తులు వంద‌ల కోట్ల నోరోవైర‌స్ అణువుల‌ను కలిగి ఉంటారు. కాబట్టి వీరి ద్వారా ఇత‌ర వ్య‌క్తుల‌కు సోకే ప్రమాదం లేకపోలేదు. అయితే నోరోవైర‌స్ సోకితే.. ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకోవచ్చు. వృద్ధులు, చిన్న పిల్ల‌లు, అనారోగ్య స‌మ‌స్య‌లున్న వాళ్లలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. వీళ్ల‌కు మాత్రం చికిత్స త‌ప్ప‌నిస‌రిగా అవసరం. ఒక్కోసారి ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యే అవసరం పడొచ్చు. సాధారణంగా అయితే ఈ వైర‌స్ బారిన పడిన వాళ్లు ఒక‌టి నుంచి మూడు రోజుల్లో కోలుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR