మీ వంట్లో రోగనిరోధక శక్తి తగ్గినవుడు కనిపించే లక్షణాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. పరిసరాలు, స్వీయ శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటి ఆహారాన్నే ఇష్టపడేవారు సైతం ఇప్పుడు కరోనాకు బయపడి ఇంటి లోనే తయారు చేసుకుని తినటానికి మొగ్గు చూపుతున్నారు, ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెపొందించే ఆహార పదార్ధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మనలో రోగనిరోధక శక్తి లోపించినపుడు కనిపించే కొన్ని లక్షణాలను గమనించుకుంటే తగిన జాగ్రత్తలు ముందే తీసుకోవచ్చు.. మరి ఆ లక్షణాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

 

Immunity Powerచాలా మంది తరచు జలుబు, దగ్గుకు గురవుతుంటారు.. ఇలాతరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. సంవత్సరంలో నాలుగు సార్లకంటే ఎక్కువగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకుని పెంపొందించేందుకు ప్రయత్నాలు చేయాలి..

Immunity Powerకొంత మందికి రాత్రిలు నిద్ర పట్టదు.. ఒకవేళ నిద్ర పోయిన తరచు మెలకువ వస్తుంటుది…. అలానే కొందమందిలో ఎంత ఎక్కువ నిద్ర పోయి లేచిన తర్వాత కూడా భారంగా అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే.

Immunity Powerఅలాగే తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం..కడుపులో అనిజీగి ఉండటం జరిగిన మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి.

Immunity Powerకొంతమందిలో గాయాలు చాల నెమ్మదిగా నయమవుతుండటం చూస్తుంటాం.. అయితే దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అలా కాకుండా గాయం మానుపుకి ఎక్కువ సమయం తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి ఇది సంకేతం..

అలాగే మీరు కనుక తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నా,జలుబు, దగ్గు, మూత్ర సమస్యలు, చెవిపోటు, సైనస్‌ లాంటి సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే మీ ఇమ్యూనిటీ సిస్టం వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్‌లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది గుర్తు.. ఈ లక్షణాలు మీరు గమనించినట్లయితే వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. తగిన వ్యాయమాలు చేయడం మంచిది.. అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకున్నా మంచిదే..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR