కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో తెలిపే లక్షణాలు

0
2186

ఆహారపు అలవాట్లతో నో లేక ఇంకేమైనా కారణంతోనో చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఈ రాళ్లను కరిగించడానికి ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది రాళ్లు ఉన్నాయని తెలుసుకోలేక ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు.

Symptoms of kidney stonesఇవి ఎక్కువ అవకముందే ప్రాధమికంగా ఈ సమస్యని గుర్తిస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది అంటున్నారు వైద్యులు. మరి అసలు కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

Symptoms of kidney stonesకొన్ని లక్షలను బట్టి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. బొడ్డు ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తుంటే, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నాయో చెక్ చేయించుకోవాలి. మూత్రం వచ్చిన సమయంలో నొప్పి వస్తుంది. మంట ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సమస్య ఉన్నట్టు గుర్తించాలి. మూత్రం ఎర్రగా రక్తంతో వస్తున్నా ఈ సమస్య ఉంది అని తెలుసుకోవాలి.

Symptoms of kidney stonesఇక మూత్రం పోసే సమయంలో నొప్పి ఇబ్బంది వస్తున్నా, ప్రతీ గంట అరగంటకు మూత్రం వస్తూన్నా మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతంగా గుర్తించాలి. మూత్రం వాసన వస్తూంది అంటే ఇది కూడా మరో లక్షణం. ఒకేసారి వాంతులు చలి జ్వరం ఇలాంటి సమస్యలు వస్తే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుతున్నట్లు సూచన.