ఈ లక్షణాలు కన్పిస్తే మీకు పక్షవాతం ఉన్నట్లే

క్యాన్సర్, గుండె జబ్బుల తరువాత అంత ఎక్కువగా ప్రమాదకరమైంది, ప్రాణాపాయమైంది పక్షవాతం. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది. ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు. అప్పటిదాకా ఆనందంగా అటూఇటూ తిరిగినవారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. కాళ్లూ, చేతులూ పడిపోయి వికలాంగుల్లా మారిపోతారు. కొందరు ప్రాణాలే కోల్పోతారు.

Symptoms Of Paralysisపక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతము’ అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది.

Symptoms Of Paralysisమెదడులోపలి ధమనుల ద్వారా మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే స్ట్రోక్ లేదా పక్షవాతం. రక్త ప్రవాహానికి ఆటంకం కలగడమనేది ధమనిలోని ఎదో భాగాన రక్తం గడ్డకట్టడం మూలంగా కావచ్చు. లేక దమని చిట్లడం మూలంగాను కావచ్చు. దమని ద్వారా మెదడుకు వెళ్ళే రక్తం మెదడుకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తుంది.

Symptoms Of Paralysisమెదడుకు రక్త సరఫరా ఆగిపోగానే ఆక్సిజన్ సరఫరా కూడా ఆగిపోతుంది. ఆక్సిజన్ సరఫరా లేక పోయేసరికి మెదడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దానివల్ల మెదడుకి చెందిన విలువైన కణజాలం నశించిపోతాయి లేక సీరియస్ గా డ్యామేజ్ అవుతాయి. ఈ డామేజ్ జరగడానికి కేవలం నాలుగు నుండి ఐదు నిమిషాలు చాలు. మెదడుకి వెళ్ళే సరఫరాకి కేవలం నాలుగు ఐదు నిమిషాలు అవరోధం ఏర్పడితే చాలు పక్ష వాతం వచ్చేస్తుంది.

Symptoms Of Paralysisగతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. పక్షవాతం వచ్చే అవకాశం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. అధిక శాతం పురుషులు మద్యపానం, ధూమపానం చేస్తుంటారు. దీంతో పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

Symptoms Of Paralysisస్ట్రోక్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాల్లో అడ్డుతగలడం వల్ల అక్కడి భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక కొన్ని భాగాలు చచ్చుబడడం వల్ల వస్తుంది. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తం కారి వస్తుంది. అయితే కొన్ని సంకేతాలు, లక్షణాలను బట్టి స్ట్రోక్ రావడాన్ని ముందే గుర్తించవచ్చు.

-మాట్లాడటం మరియు మరొకరు మాట్లాడేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఈ అంశాలలో గందరగోళానికి గురవుతారు.

-అకస్మాత్తుగా తిమ్మిరి, బలహీనత సంభవించవచ్చు .

– దృష్టి సమస్యలు రావచ్చు. వస్తువులు రెండుగా కనిపించుట, చూపు మసకబారడం, ఒకటి లేదా రెండు కళ్ళలో నల్లబడటం జరగవచ్చు.

Symptoms Of Paralysis-అకస్మాత్తుగా, తీవ్రమైన తలనొప్పి ఉండవచ్చు. వాంతులు, మగత లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కలిగి ఉండవచ్చు.

-ఆకస్మిక మైకము, లేదా సమన్వయం కోల్పోవడం వంటి వాటి వల్ల నడవటంలో ఇబ్బందులు కలగవచ్చు.

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్‌ యూనిట్‌ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్‌ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR