This Guy’s Take On Self Inspiration Is Motivational and Totally Spot On !

Contributed by Harsha Vardhan Sadhanala

వచ్చేటప్పుడు అందరూ ఒంటరే…వెళ్ళేటప్పుడు కూడా…కానీ ఈ మధ్యలో ఒక తోడు కోసం ఒంటరిగా చూసే చూపుకి ఎవరు జతవుతారో తెలీదు.!

మన జీవితం సుదూర ప్రయాణం..అందులో ప్రతీ మజిలీకి మనతో ఇంకో తోడు అవసరం లేదా ఒక భరోసా అవసరం ఓటమిలో మన భుజంపై ధైర్యాన్నిచ్చే ఒక చేయి అవసరం అలా నాకు దగ్గరైనవాళ్ళకి జీవితంలో ఎదో కోల్పోయిన బాధలోవున్న ప్రతీసారీ వాళ్ళు ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా కోల్పోకుండా ఉండాలి అని ఒక భరోసాగా మాత్రం నేను ఎప్పుడూ ఉండేవాడిని ఉంటాను కూడా.

Lifeకానీ నేనే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం నా భుజం మీద ఎవ్వరి చేయి లేదు నాతో నాకు తోడుగా ఉంది నా నీడే … నన్ను నేను కోల్పోకుండా నాకు నేనే ధైర్యాన్ని తెచ్చుకుని ఆ పరిస్థితులని ఆ రోజులని భారంగా ఉన్నా దాటే వాడిని…అలా దాటుతూ కష్టాలన్నీ సొంతంగానే ఎదుర్కోవడం అలవాటైంది కాదు..అలవాటు చేసుకున్నా.!

నీ కష్టం లో ఎప్పుడూ మేము తోడవుతామని నమ్మకంగా నవ్వుతూ ఎవరైనా అన్నా నిజంగా నీ మనసులో బాధ అంతా నీ ముఖంలోనే ఉన్నా కూడా వాళ్ళు ఆ సమయంలో అసలు నీకు ముఖం కూడా మళ్ళీ చూపించకపోవచ్చు…ఇది నాకో విషయాన్ని బాగా గుర్తుండిపోయేలా గుర్తుచేసింది అందరం కలిసే ఉన్నా, కలిసేవుంటాం అని చెప్పినా అది కొంత వరకే నిజానికి ఎవరి జీవితంలో వాళ్ళు చేయాల్సింది ఒంటరి పోరాటమే కదా..!!

Lifeమనం గేలిచి ఓక స్థాయి లో నిలపడ్డాక మన చుట్టు చాలా మంది వుండచ్చు కాని అదే ఓడిపోయాక అంటే మనం దాదాపు కింద పడ్డాక ఒకళ్ళొచ్చి చేయందిస్తారు గెలిచి మళ్ళీ నిలవడానికి ఒక చేయూతనిస్తారని అనుకోవడం దానికోసం ఎదురు చూడటం అనవసరం…కష్టమైనా అది నీకు కొత్త కాదుగా మెల్లగా నీకు నువ్వే మళ్ళీ నిలబడాలి ఎలాంటి ఆసరా లేకుండానే… మార్పు నీతోనే నీలోనే మొదలవ్వాలి…నీ సమస్యలతో నువ్వే పోరాడాలి… నీ కోసం నువ్వే నిలబడాలి …ఇంకెవరోకాదు…ప్రతిరోజూ ఒక కొత్త సవాలే … దానికి నువ్వే సిద్ధంగా ఉండాలి ఓదార్పు కోసం ఎదురు చూడకూడదు ఆలా అని అదే పరిస్థితుల్లో ఉన్న ఎవ్వరినీ అలాగే వదిలేయకూడదు.

కానీ నువ్వు లేచినా పడినా నీతోపాటే నువ్వు ఎలాంటి పరిస్థితులో ఉన్నా నీతోనే ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది నీ మీద వాళ్లకున్న ప్రేమ వల్లే వాళ్ళు ఎప్పటికీ నీవాళ్ళే..!!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR