స్ట్రెస్, డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారా అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి

పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, గింజలు, పప్పుధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఉద్యోగ బాధ్యతలు తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతున్నాయి. కానీ ఈ ఒత్తిడి నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను ఒక దశకు వచ్చేసరికి మార్పులు చేసుకోవాలి. మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురయ్యేవారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉంటున్నారు.

డిప్రెషన్సాధ్యమైనంత వరకూ ఇంటి ఆహారాన్నే తింటే శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. బర్గర్లు, పిజ్జాలు, మాట్ డాగ్స్ వంటి బేకరీ పదార్థాలు తినని వారితో పోలిస్తే తరచూ తీసుకునే వారిలో యాభై ఒక్క శాతం మంది మానసిక ఆందోళనకు గురవుతారు. దాంతో పాటు శారీరక చురుకుదనం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నెలలో ఒకటి రెండు సార్లకు మించి బేకరీ పదార్థాలను తీసుకోకపోవడమే మేలు. అదే సమయంలో వ్యాయామానికీ ప్రాధాన్యం ఇస్తే ఎటువంటి ఒత్తడి ఉండదు. మరి ఆహార విషయంలో ఒత్తిడిని పారద్రోళే ఆహారాలేంటో చూద్దాం.

బంగాళ దుంప:

బంగాళ దుంపబంగాళ దుంపలో జింక్‌, విటమిన్‌ సి రోగని రోధకశక్తిని ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

టర్కీ చికెన్:

టర్కీ చికెన్టర్కీచికెన్ లో అమినో ఆసిడ్స్ మరియు సెరోటినైన్ ఆనందగా ఉండేందుకు ఉపయోగపడే కెమికల్స్ ఉంటాయి. సెరోటొనైన్ మనస్సును ప్రశాంత పరచడమే కాకుండా తాజాగా పీల్ అయ్యేలా చేస్తుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ఆస్పరాగస్ లో ఫోలిక్ ఆసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీ శరీరం ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది.

బీఫ్:

బీఫ్బీఫ్ లో ఉన్న విటమిన్ బి మరియు జింక్ ఒత్తిడికి కారణం అయ్యే లక్షణాలను ధరిచేరనివ్వవు. అయితే ఇది వండే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఆరోగ్యానికి మంచిది.

బొప్పాయి:

బొప్పాయికెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.

కమలాఫలం:

కమలాఫలంవ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్‌ వల్ల ఒత్తిడి ప్రభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

అరటిపండు:

అరటిపండుదీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు చేస్తుంది.

చాకోలెట్:

చాకోలెట్వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసిద్దమైన యాంటీ – డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది.

పాలు:

Milkపాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

గోధుమ:

గోధుమగోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. నూతనోత్తేజం కలిగిస్తుంది.

ఆప్రికాట్:

ఆప్రికాట్ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్, ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. ఆప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR