తల స్నానం చేయడానికి అనువైన సమయం, రోజు ఏవో తెలుసా ?

పూర్వం ఏ చిన్న పని చేసినా నియమనిబంధనలు పాటించేవారు. స్నానం కూడా శాస్త్రాన్ని అనుసరించి చేసేవారు. ఈరోజుల్లో ఎప్పుడుపడితే అప్పుడు తలస్నానం చేయడం అలవాటైపోయింది. కానీ అలా తలస్నానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్నది ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడింది. పాడ్యమినాడు రిక్తతిథుల్లో పున్నమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, షష్ఠి, ఏకాదశి ద్వాదశి, సప్తమి, త్రయోదశి, తదియ, నవమి తిథుల్లో సంక్రాంతినాళ్ళల్లో వ్యతిపాతాల్లో పితృకర్మలు చేసే రోజుల్లో ఉపవాసం చేసేరోజుల్లో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తైల మర్దనాన్ని శాస్త్రాలు నిషేధించాయి. అంటే ఈ రోజుల్లో తలంటు పోసుకోరాదు. దానివల్ల సంపదలు తొలగిపోతాయి. ఆయుస్సు క్షీణించి పోతుంది.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliఅష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, గ్రహణాలు ఇవన్నీ సంధికాలాలు సూర్యునికి భూమికిగల సంబంధంలో విషమత్వమేర్పడుతుంది. ఈ రోజుల్లో అభ్యంగనస్నానం చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మరి తల స్నానం చేయడానికి అనువైన సమయం, రోజు ఏవో తెలుసుకుందాం. వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు, వసతి కలుగదు . అలాంటి వారు వారనికి రెండు,మూడు రోజులు తలస్నానం చేస్తారు. వారికోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని విదాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది. అనే విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లైతే స్నానాలు ఉదయం పూటనే చేయాలి, సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది. వృద్దులు, రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliశరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తల స్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు, జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. అదే విధంగా ఆదివారం నాడు తల స్నానం అనుకూలం కాదు. ఫలితంగా శరీర కాంతి(అందం) తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది. దుఃఖం సంతానానికి కీడు. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరినూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకుని స్నానం చేస్తే దోష పరిహారం జరుగుతుంది.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliసోమవారం తలస్నానం పనికిరాదు. ఫలితంగా కలవరం కాంతిహీనం, భయం కలుగుతుంది. దోష పరిహారం కోసం కొబ్బరినూనెలో మందారపూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోషపరిహారం అవుతుంది.

మంగళవారం తలస్నానం అసలే పనికి రాదు. చేస్తే ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను, ఆవు తోక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది.

బుధవారం తలస్నానం చేస్తే శుభం. ఫలితంగా లాభం, కీర్తి, సంపద కలుగుతుంది, జ్ఞానం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliగురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి, విద్యా లోపము, ధనవ్యయం, కీడు, శత్రువులు అధిక మవుతారు. దోష పరిహారం కోసం నూనెలో గరిక కానీ పుష్పాలను కానీ కలిపి తలంటుకుని స్నానం ఆచరిస్తే దోషపరిహారం జరుగుతుంది.

శుక్రవారం తలస్నానం చేస్తే అశాంతి, వస్తు నాశనం, రోగ ప్రదం. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూతిని గానీ గోమయము గానీ కలిపి తలంటుకుని స్నానం చేస్తే దోషపరిహారం జరుగుతుంది.

శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, శుభకరమైనది. ఈ రోజు తప్పక అందరు తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliశాస్త్ర ప్రకారం తలస్నానం బుధవారం, శని వారం రోజుల్లో చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పండగ పర్వదినాలలో, పుణ్యక్షేత్రాలలో, పుట్టినరోజు నాడు తలస్నానం చేయడానికి శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమాలు లేవు. అది ఏ వారమైనా నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రం సూచిస్తుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు.

Tala Snanam Ela Cheyali A Roju Cheyaliవారానికి రెండు సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్థాయి. ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసే వారు, వారానికి రెండుసార్లు స్నానం చేసే వారైన కనీసం నెలలో నాలుగు సార్లు అయిన స్నానపు నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పోడి వేసుకొని తల స్నానం చేయడం వల్ల గ్రహ దోష నివారణలకు చక్కని తరుణోపాయంగా ఉపయోగపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR