టీ, కాఫీ, కోల్డ్ కాఫీ ఈ మూడింటిలో ఏది తాగడం మంచిది?

ఉదయం లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే అవి తాగనిదే బెడ్ మీద నుంచి కిందికి కూడా దిగరు. అది లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది. ఇవి తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీలవుతుంటారు. దీనికి వీటిలోని చక్కెర, కెఫీన్ రెండూ కారణాలు. మన ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తాగేది ఆల్కహాల్ కాదు. టీ మరియు కాఫీ. అవి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మానలేరు. అయితే చాలామంది టీ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండదని, దీనిద్వారా ఆహారం తినకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని, అనేక రోగాలు వస్తాయని అంటూ ఉంటారు.

teaకొంతమంది టీ మంచిదని మరికొంతమంది కాఫీ మంచిదని ఇంకొంతమంది కాఫీ కంటే కూడా కోల్డ్ కాఫీ మంచిదని అంటూ ఉంటారు. అసలు టీ మరియు కాఫీ అనేవి మన దేశానికి సంబంధించినవి కావు. టీ అనేది బ్రిటిష్ వాళ్ళ వల్ల మన దేశానికి 1836లో వచ్చింది. వాళ్ళని చూసి మనం టీ తాగడం నేర్చుకున్నాము. అయితే కాఫీ, టీ కంటే ముందు వచ్చింది. 1670 లో ఈస్టిండియా కంపెనీ వల్ల మన ఇండియాలో కాఫీ వచ్చింది. సైన్స్ ప్రకారం టీలో ఆల్కహాల్ ఉండదు. అంతేకాకుండా . సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఇందులో ఏ విధమైన యాడెడ్ ఫ్లేవర్స్ ఉండవు కాబట్టి హానికరం కాదు.

coffeeటీ లో ఎల్ – థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. టీలో చాలా రకాలున్నాయి. బ్లాక్ టీ, వైట్ టీ, ఎల్లో టీ, గ్రీన్ టీ ఇలా చాలా రకాలు ఉన్నాయి.. వీటన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మనకు డయాబెటీస్, హార్ట్ఎటాక్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా టీ బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

immunityఅయితే టీ పళ్లను పసుపు రంగులోకి మార్చుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది. అలాగే కాఫీలో కూడా మనకు చాలా రకాలున్నాయి. బ్లాక్ కాఫీ, గ్రీన్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, నార్మల్ కాఫీ ఇలా చాలా కాఫీలు ఉన్నాయి. మనం కాఫీ తాగడం వల్ల క్యాన్సర్, డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాఫీ లో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్ గా తీసుకుంటూ ఉంటారు.

tea & coffeeకొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండింటిలో పోల్చితే కాఫీ కంటే టీ మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీలో కెఫీన్ స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. కప్పు బ్లాక్ టీ లో 14 నుంచి 70 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉండగా.. కప్పు కాఫీలో 95 నుంచి 200 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుంది.

caffeineఅయితే ఇటీవలి కాలంలో కోల్డ్ కాఫీ తాగేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. వేడి వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ తాగడం మంచిది అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది అంత మంచిది కాదని డాక్టర్ లు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఆఫీస్ లో పనిచేసేవారు కోల్డ్ కాఫీ తాగితే అలసట ఉండదు అని భావిస్తుంటారు. అయితే కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో అది తప్పని తెలిసింది. కోల్డ్ కాఫీ తాగడం కంటే , వేడి వేడి కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని పరిశోధకులు తెలియజేశారు. కోల్డ్ కాఫీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటే వేడి కాఫీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి. కనుక వీలైనంత వరకు కోల్డ్ కాఫీ తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే జీర్ణాశయ సమస్యల తో పాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR