తెల్లని అన్నం నైవేధ్యంగా పెడితే!

ఈ ప్రపంచంలో ఏదైనా ధనం వల్లే సాధ్యమవుతుంది. ధనం మూలం ఇదం జగత్. అదే సమయంలో ధనంతోపాటు ఆనందంగా ఉండాలి అని కోరకుంటారు ప్రతి ఒక్కరు. జీవితానికి ధనం అదేనండి ఐశ్వర్యం, ఆనందం రెండు ముఖ్యమే. దీనికోసం పెద్దలు అనేక పరిష్కారాలు చెప్పారు వాటిలో కొన్ని అన్నం నైవేధ్యంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం, ఆనందం ప్రాప్తిస్తాయి.

1-Rahasyavaani-1095తెల్ల అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

3-Rahasyavaani-1095తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో ఎవరైతే వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదు ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

4-Rahasyavaani-1095తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా పెట్టిన వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

8-Rahasyavaani-1095తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం,భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

7-Rahasyavaani-1095తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృ దేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

5-Rahasyavaani-1095సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదలులో కానీ వేస్తే ఎటువంటి దిష్టి అయినా తొలగిపోతుంది.

సాధారణ సమస్యలు అయితే ఈ పరిహారాల వల్ల ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు జాతక చక్రాన్ని పరిశీలించి తగిన పరిహారం చేసుకుంటే పూర్తి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

2-Rahasyavaani-1095

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR