TFI Is Changing & Telugu Audience Are Encouraging Content Based Movies. Here’s Proof

ప్రతి సంవత్సరంలో ఏదో ఒకటో రెండో కొత్త కథలు వస్తాయి, వచ్చినా అవి డబ్బులు తెచ్చి పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ గత 2 – 3 ఏళ్ళ కాలంలో చూస్తే ప్రతి సంవత్సరంలో ఒక్క సినిమా మాత్రం కచ్చితంగా ప్రశంసలతో పాటు కాసులు కూడా తెచ్చిపెడతాయి మన “C / O కంచెరపాలెం” and “అర్జున్ రెడ్డి” లాగా అన్నమాట. అలాంటిది ఈ సంవత్సరం కొత్త కథలు, దానికి తోడు చాతుర్యంతో కథని నడిపే విధానం వీటిన్నిటిని మించి బాక్స్-ఆఫీస్ దగ్గర కాసులు వాటితో పాటు ప్రశంసలు కూడా దక్కించుకున్న కొన్ని సినిమాలు ఏవో ఒకసారి చూద్దామా?

1) Jersey

Jersyసినిమాలో హీరో చచ్చిపోతే సినిమాలు ఆడవు అని ఒక నానుడి ఉంది. అసలు చావు అంటే ఏమిటి మన శరీరం అస్తికలు అవ్వడమా? కాదు నువ్వు బతికి ఉన్న నీకు ఏ గుండెలో చోటు లేకపోవడం అది చావు అంటే…కనుక ఈ కథలో అర్జున్ కి చావు లేదు ఈ సినిమాకి మన హృదయంలో ఒక ప్రత్యేక గుడి ఉంది. ఈ సినిమా ముగిసిన తరువాత ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో తడి మైమరచి చప్పట్లోతో అర్జున్ కి నివాళి.

2) Agent Sai Srinivasa Athreya

AGENT SAI srinivas atreyaఈ సినిమా చాలా ఘనమైన ప్రేక్షక ఆదరణ పొందింది. ఒక బూతు మాట అనేసి నవ్వించేయవచ్చు కానీ చాలా dignified కామెడీ చేయడం కత్తి మీద సాము. ఈ team దీనిని సాధించారు అందుకే ఇంతటి కల్ట్ following తెచ్చుకోగలిగింది. కానీ ఈ హాస్యం ఇదంతా ఒక వైపే ఈ కథలో ఒక most sensitive topic ని ఎంతో అద్భుతమైన కథనంతో జనాలకి చెప్పగలిగారు. బాగా గమనిస్తే ఒక ‘Shutter Island ‘ screenplay templateకి Raj Kumar Hirani స్టైల్ అఫ్ కామెడీని జోడించి ఈ సినిమా తీసినట్టు ఉంటుంది. నా దృష్టిలో ఈ సినిమాకి లభించిన క్రేజ్ చాలా తక్కువ అసలు సిసలైన content తో కూడిన “Pan India Cinema” ఇది.

3) Brochevarevarura

3) Brochevarevaruraక్రైమ్ కామెడీ అనగానే నాకు గుర్తొచ్చే సినిమా “క్షణక్షణం” ఇప్పుడు క్షణక్షణంతో పాటు బ్రోచేవారెవరురా కూడా గుర్తొస్తుంది. ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎక్కడ కథ చెప్పే విధానంలో రాజి పడినట్టు అనిపించదు అలాని ప్రేక్షకుడిని గందరగోళం గురి చేసే కథనం కాదు. ఒక సరైన మీటర్లో ఎంతో అద్భుతంగా తెరకెక్కిన కథ ఇది.

4) Oh! Baby

Oh! Babyఈ దశాబ్దంలో తెలుగు వెండితెరకి దొరికిన అద్భుతం సమంత. ఇప్ప్పుడు తన చేస్తున్న సినిమాలే వాటికి సాక్ష్యం. ఈ సినిమాలో సమంత నటన చూసి తనని ప్రేమించకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి జనాలు సినిమా హాల్లా బయట క్యూ కట్టేలా చేయగలింది సినిమా.

5) Evaru

Evaruఅడివి శేష్ ఒక్కడే ఒక parallel సినిమాలా ఉన్నాడు ఇప్పుడు. ఏదో ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ కోసమే అతని సినిమాలు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు అన్ని సెక్షన్ అఫ్ ఆడియెన్సుని అతని సినిమాలు అలరిస్తున్నాయి. ఎవరు సినిమా గురుంచి చెప్పేదేముంది చివరి దాకా ఒక్కడు కూడా థియేటర్లో ఎక్కడికి కదలలేదు. అవును ఈ సినిమా రీమేక్ యే, కానీ తియ్యాలి కదా జనాలని అలరించాలి కదా రెండు చేయగలిగారు ఈ టీం.

6) Khaidi

Khaidiఇది ఈ లిస్ట్లో ఉండాల్సిన సినిమా కాదు ఎందుకంటె ఇది ఒక డబ్బింగ్ సినిమా కానీ ఈ కథ తమిళనాడులో కన్నా తెలుగు రాష్ట్రాలలో ఒక విధ్వంసమే సృష్టించింది. ఈ సినిమా ఆడే టైములో FB మొత్తం ఈ సినిమా గురించే . సరైన కథ దానిని చాకచక్యంగా చెప్పగలిగే నేర్పు ఉంటె చాలు ప్రేక్షకులకి యే హంగు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించిన చిత్రం మన ఖైదీ.

7) Mathu Vadalara

Mattu Vadalaraగత కొన్ని నెలలుగా ఒక మూస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇదేంట్రా అనుకునే టైంకి ఒక అద్భుతమైన సినిమా వచ్చింది ఆడే “మత్తు వదలరా” ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటె వెంటనే చూసెయ్యండి. ఈ సినిమా 2019 ని గొప్పగా ముగించింది.

 

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR