Home Unknown facts ఆడవారికి అనుమతి లేని ఆలయాలు!!!

ఆడవారికి అనుమతి లేని ఆలయాలు!!!

0
list of temples where women are not allowed

ఇప్పుడున్న ఆధునిక యుగంలో లింగ బేధం లేకుండా స్త్రీ, పురుషులు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మన దేశంలో ఇదివరకటిలా కాకుండా మహిళలు పురుషులతో పోటీపడి పని చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. సమాజంలో స్త్రీలకు ఉండే అడ్డుగోడలు అన్నీ బద్దలై స్వేచ్ఛ, సమానత్వం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రం నేటికీ మహిళల పక్ష వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశమైన శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు అనుమతి లేదు. అలాంటి కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం…

మొన్నీమధ్య మహారాష్ట్రలోని శని శింగణపూర్ లోని శనిదేవుడి ఆలయంలోకి ఒక మహిళ పూజలు చేయించుకోడానికి ఆ ఆలయంలోకి ప్రవేశిస్తుండగా, ఆలయం బయటే నిలిపివేశారు. ఇక్కడ స్త్రీలు ప్రవేశించరాదని ఆ ఆలయం నుండి ఆమెను బయటకు పంపారు. ఆలయ ప్రాంగణం వరకూ ఆమెను అనుమతించారని అక్కడ పనిచేస్తున్న ఏడుగురు సెక్యురిటీ సిబ్బందిని ఆలయ కమిటీ అధికారులు సస్పెండ్ చేసి, ఆలయం మొత్తాన్ని శుభ్రం చేశారు. ఇలా ఇంకా కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మహిళలను లోనికి అనుమతించరు.

అయ్యప్ప దేవస్థానం, శబరిమల:
కేరళ రాష్ట్రంలో పత్తినంతిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమలలో నెలకొన్న పుణ్యక్షేత్రం శబరిమల. భక్తులు 41 రోజులు కటోరమైన దీక్షలు, నిష్ఠలు పాటించి చేసి శబరిమల యాత్రకు బయలుదేరుతారు.
శబరిమాలలో కొలువైన అయ్యప్పదేవస్థానంలోకి 12-25 వయసున్న స్త్రీలను అనుమతించరు.పురాణాల ప్రకారం యువకుడిగా ఉన్న అయ్యప్పను, తనను వివాహం చేసుకోవాల్సిందిగా నీల అనే యువతి తన కోరికను తెలుపగా, ఆమె కోరికను అయ్యప్ప తిరసకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానని, పెళ్లి చేసుకోనని అప్పుడు అయ్యప్ప ప్రతిజ్ఞ చేసినట్లుగా పురాణాల కథ. అందుకే ఈ దేవస్థానం లోకి యవ్వన వయసులో ఉన్నటువంటి స్త్రీలను అనుమతించరని చెబుతుంటారు.

కార్తికేయ గుడి, పెహోవా హర్యానా:
హర్యానాలో ఉన్నటువంటి కార్తికేయ పుణ్యక్షేత్రానికి మహిళలను అనుమతించరు. పంజాబ్- హర్యానా సరిహద్దుల్లో ఉన్న కార్తికేయ ఆలయాన్ని 5వ శతాబ్దంలో దర్శించుకునేందుకు ఒక అమ్మాయి దేవస్థానానికి రాగా, ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆమెను అక్కడవారు నిందించారట. ఈ ఆలయంలో మహిళలను అనుమతించకూడదనడానికి “బ్రహ్మచారిగా ఉంటూ ధ్యానం చేస్తున్న కార్తికేయ, బ్రహ్మ నుండి తనకంటే శక్తులు పొందుతాడని ఈర్ష్యకు లోనై అందాలనర్తకి అప్సరసను భూలోకంలో ధ్యానస్థితిలో ఉన్న కార్తికేయ ధ్యానాన్ని భగ్నం చేయాలని పంపిస్తాడు. తన దీక్ష భగ్నం చేసిన అప్సరసపై కోపంతో ఆమెను రాయిలా మారేలా కార్తికేయుడు శపించాడని, ఏ స్త్రీ ఇక్కడికి వచ్చినా రాయిలా మారుతుందని పురాణాలలో ఉన్నట్లు అందుకే ఈ ఆలయంలోనికి మహిళలను రానివ్వరని చెబుతున్నారు.

మవాలి మాతా మందిర్, చత్తీస్ ఘర్:
బ్రహ్మచర్యం ఉన్న వారిని, మహిళలు తమ వశం చేసుకోవడానికి పై రెండు దేవస్థానాలలో స్త్రీలను అనుమతించరని పురాణాలు చెబుతుంటే, చత్తీస్ ఘర్ లోని మవాలి మాతా మందిర్ లోకి స్త్రీలను అనుమతించకూడదని ఇక్కడి ఆలయ అధికారులే ప్రకటించారు. ఈ ఆలయంలో కొలువైన మవాలి మాత ఒకరోజు భూమిని చీల్చుకుంటూ ఇక్కడికి మహిళలను అనుమతించకూడదని, తను పెళ్లి చేసుకోలేదని ఆలయ పూజారులు శ్యామల సాహు, శివ థాకూర్ లతో ఆ దేవత చెప్పినట్లుగా అక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు.

ఇక్కడికి మగవారిని మాత్రేమే దర్శనానికి అనుమతిస్తారు. అమ్మ అనుగ్రహం పొందేందుకు స్త్రీల కోసం దగ్గరలోని మరో ఆలయాన్ని మవాలి మాత మందిర్ పేరు మీదట నిర్మించారట.

హజీ అలీ దర్గా:
హిందువుల ఆలయాలే కాదు, ముస్లిం మతాదికారులు,ఇస్లాం ప్రకారం ముస్లిం మహిళలు సమాధుల వద్దకు గానీ స్మశానంలోకి వెళ్ళడం వారి అభిప్రాయమని అంటున్నారు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మహిళలు రాకూడదని, ముస్లిం సాధువులు చెబుతున్నారు. ఈ విషయమై ముంబై కోర్టు ఆదేశించినట్లు కథనాలు ఉన్నాయి. కొన్నేళ్ళు ఇలా నడిచినా ఎలాంటి అసౌకర్య సమస్యలు ఎదురైనా స్త్రీలను రక్షించడం కష్టమని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు అంటున్నారు.

శ్రీ కృష్ణ దేవాలయం, కేరళ:
కేరళలో తిరువనంతపురం దగ్గరలోని మలయింకుజు గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఓకే ప్రాంగణంలో ఉన్న ఒక గుడిలో కొందరు స్వామీజీలు ఉండేవారట. దశాబ్దాల కాలంలో పద్మనాభ ఆలయానికి చెందిన ఆ స్వాములు, ఇక్కడి శ్రీకృష్ణ ఆలయానికి వచ్చి కొన్ని నెలలు నివసించారట. ఇక్కడకు మహిళలు ప్రవేశించరాదని ఆ స్వామీజీలు తెలిపారట. అయితే కొందరు మహిళలు ఈ ఆలయ ప్రాంగణంలోని ఓ చోటుకి వెళ్ళడానికి ప్రయత్నించగా, వారి చర్యను స్వామీజీలు ఖండించినట్లు అక్కడి ఆలయ అధికారులు చెబుతారు.

జైన్ టెంపుల్, జనక్ పూర్:
ఋతుక్రమం సమయంలో ఉన్న స్త్రీలు, తీర్థయాత్ర ప్రదేశాలుగా ఉన్న జైన్ టెంపుల్ లోనికి ప్రవేశించకూడదని రాజస్తాన్ లోని జనక్ పూర్ లో ఉన్నటువంటి జైన్ టెంపుల్ అధికారులు చెబుతున్నారు. అలా వచ్చిన వారు పాపం చేసినట్లుగా భావింపబడతారని అంటున్నారు.
అలాగే ప్రస్తుత మోడరన్ డ్రస్సులు కాకుండా, సాంప్రదాయ దుస్తులు, చీరెలు ధరించిరావాలని జైన్ టెంపుల్ అధికారులు తెలుపుతున్నారు.

పత్బాసి సత్ర, అస్సాం:
15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవ అనే తత్వవేత్త అస్సాంలో పత్బాసి సత్రాన్ని నిర్మించాడు. ఈ ఆశ్రమంలోకి,ఆలయ గర్భగుడిలోని 2010 సంవత్సరం వరకూ స్త్రీలను అనుమతించేవారు కాదట.
కాగా అప్పటి అస్సాం గవర్నర్ జెబి పట్నాయక్ 20 మంది మహిళలను ఈ ఆశ్రమ గర్భగుడిలోకి తీసుకెళ్ళి, ఆచారాల పద్ధతిని అనుసరించి ప్రార్థనలు చేశారట. అలాగే ఆ సత్రాధికారిని పాత పద్ధతిని, ఆ ఆచారాలను తప్పించి, మహిళలను ఒప్పించినట్లు అస్సాం ప్రజలు చెబుతున్నారు.

Exit mobile version