పార్వతి పరమేశ్వరులు ఎత్తిన అవతారాలు ఏమిటో తెలుసా ?

దుష్టులను శిక్షించడానికి, భక్తులకు రక్షించడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలో ధర్మాన్ని నిలబెట్టాడు. ఈ విషయం మనకు తెలుసు అయితే ఆది దంపతులైన శివుడుపార్వతి కూడా పది అవతారాలు ధరించి లోకకల్యాణం చేసారు. అయితే ముందుగా అవతారం ఇంతే ఏంటో తెలుసుకుందాం. అవతారం అంటే దిగుట, పైనుండి క్రిందికి రావడం. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండే దేవుడు లోక క్షేమం కోసం భూలోకం వచ్చెనని అర్ధం.

పార్వతి పరమేశ్వరులులోకంలో ధర్మం ఉన్నంతకాలం ఎవ్వరి అవసరం ఉండదు. కానీ అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించడానికి భగవంతుడు పశురూపంలో అయినా, పక్షి రూపంలో అయినా, మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరిస్తాడు. ఇది ఒక్క మతానికో, ప్రాంతానికో పరిమితమైన నమ్మకం కాదు అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తాడని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించాడని క్రైస్తవులు భావిస్తారు.

పార్వతి పరమేశ్వరులుఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు మంచి చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పనకు, నమ్మకానికి ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించడానికి భౌతికరూపం ధరిస్తాడని నమ్మకం అవతారకల్పనకు మూలాధారం అయింది. ప్రజలకు దుష్టులతో ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలావరకు అవతారకధల ప్రధాన ఇతివృత్తం. అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు. అయితే పార్వతి పరమేశ్వరులు ఎత్తిన అవతారాలు ఏమిటో చూద్దాం.

పార్వతి పరమేశ్వరులుమొదటి అవతారం :

మాహాకాళుడు , ఈయన అర్ధాంగి ” మాహాకాళి” వీరిద్దరు భక్తులకు ముక్తినిచ్చే దైవాలు

ద్వితీయ అవతారం :

తారకావతారము , ” తారకాదేవి ” ఈయన అర్ధాంగి . సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు .

తృతీయావతారం :

బాలభువనేశ్వరావతారము – సహచరి ” బాలభువనేశ్వరీ దేవి ” సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు .

చతుర్ధావతారం :

షోడశ విశ్వేశ్వరుడు – ” షోడశ విద్యేశ్వరి ” ఈయన భార్య . భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు .

పంచమ అవతారం :

భైరవ అవతారము – భార్య ” భైరవి ” ఉపాసనాపరులకు కోరికలన్ని తీర్చే దైవం భైరవుడు .

పార్వతి పరమేశ్వరులుఆరవ అవతారం :

భిన్నమస్త — భిన్నమస్తకి ఈయన పత్నీ.

ఏడవ అవతారం :

ధూమవంతుడు — ధూమవతి ఈయన శ్రీమతి .

ఎనిమిదవ అవతారం :

బగళాముఖుడు — బగళాముఖి ఈయన భార్య .. ఈమెకు మరో పేరు బహానంద

పార్వతి పరమేశ్వరులుతొ్మ్మిదవ అవతారం :

మాతంగుడు — మాతంగి ఈయన భార్య .

పదవ అవతారం :

కమలుడు — కమల ఇతని అర్ధాంగి .
శివశక్తులు కలిసి ఇన్ని అవతారాలు ధరించిన సంగతి చాలా వరకు తెలియదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR