గోంగూర ఆకులే కాదు కాయలతో అంతకుమించిన ప్రయోజనాలు!

ఆంధ్రమాతగా పిలవబడే గోంగూర అంటే పడి చచ్చేవారు అనేకం. గోంగూర ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. అలాంటి గోంగూరతో చట్నీ మాత్రమే కాదు ఇతర వంటకాలు కూడా వండవచ్చు. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర బిర్యాని వంటి రకరకాల వంటలను తయారు చేస్తారు. పైగా మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్నే తెలంగాణ‌లో పుంటి కూర అని పిలుస్తారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి.

gongura leavesగోంగూర‌లో కాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్‌ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా తీసుకుంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గోంగూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రేచీక‌టిని త‌గ్గిస్తుంది. అధిక బ‌రువు ఉన్న‌వారు గోంగూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం మంచిది.

coughఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఒక క‌ప్పు గోంగూరను తీసుకుంటే మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి లో 53 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు త‌గ్గుతాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా విరేచనాలు తగ్గిపోతాయి.

vitamin Aఅయితే గోంగూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో గోంగూర కాయలలో కూడా అవే ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయం మనకు తెలియక గోంగూర కాయలు పడేస్తూ ఉంటాం. గోంగూర కాయలు చూడటానికి లోపల గింజ చుట్టూ ఎర్రని రంగులో రేకులు ఉంటాయి. గోంగూర ఆకు మాదిరిగానే కాయలు కూడా పుల్లగా తినడానికి రుచిగా ఉంటాయి. ఈ గోంగూర కాయలతో పప్పు పచ్చడి చేసుకుంటారు. గోంగూర కాయలు నుండి జెల్లీలు, జ్యూస్ లు తయారు చేస్తారు.

gongura kayaluగోంగూర కాయలు రక్తపోటు, నరాల వ్యాధులు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడతాయి. గోంగూర కాయలులో క్యాల్షియం, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, ఐరన్, యాంటి ఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరి గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మాలిక్ ఆమ్లం, అన్తోసైనిడ్స్, అస్తరిక్ ఆమ్లం ఖనిజ లవణాలు కూడా కలిగి ఉంటాయి. రక్త సరఫరా బాగా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.

diabetesతాజా గోంగూరకాయలలో ఆస్తరిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియా, వైరస్, కాలుష్యకారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.దీనివల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇవి యాంటీఏజింగ్ లక్షణాలు తగ్గించి ముఖంపై నల్లని మచ్చలు, వలయాలు తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. ముఖంపై కావాల్సిన తేమను అందించి స్థితిస్థాపకత, ముడతలు తగ్గిస్తుంది. గోంగూర కాయలతో టీ చేసుకుని తాగినట్లయితే శరీర బరువు తగ్గుతుంది.

gonguraగోంగూర కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్లావ్నోయిడ్స్ జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. గోంగూర కాయలు తినడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఆడవారిలో ఉండే ఇన్ఫెర్టిలిటీ సమస్యలను తగ్గిస్తాయి. గోంగూర కాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోంగూర పువ్వులు ఐదు, సోంపు అర స్పూన్, పటిక బెల్లం అర స్పూన్ చేర్చి ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున తాగితే యూరినల్ ఇన్ఫెక్షన్లు వుండవు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR