బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉండాలి అంటే ఈ ఆహారం తప్పనిసరి

పిల్లలకు ఎగ్జామ్స్ అంటే అది తల్లితండ్రులకు కూడా ఒక పెద్ద టాస్కె. ఎగ్జామ్స్ సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి గురి అవుతారు. ఎగ్జామ్స్‌లో ప్రతీ మార్కూ గ్రేడ్‌ని పెంచేదే కాబట్టి 100 పర్సెంట్ మార్కులు రావాలని ప్రతి ఒక్కరు ఆరాటపడతారు. కష్టపడి చదువుతుంటారు. ఎంత బాగా చదివితే అంత బాగా ఎగ్జామ్స్ రాస్తారు.

brain must be very sharp which means this dietఅయితే పరీక్షల టైమ్‌లో విద్యార్థులు ఎంతసేపూ చదువు, చదువు అంటు ఫుడ్‌పై దృష్టి పెట్టరు. నిజానికి బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉండాలి అంటే అందుకోసం సరైన ఫుడ్ తినాలి. చదువుతోపాటూ సరైన పుడ్ కూడా తింటే బాడీ అలసిపోకుండా, ఎనర్జీతో ఉంటుంది. కళ్లు అలసిపోకుండా ఉంటాయి. అలాగే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.

brain must be very sharp which means this dietఅందువల్ల తినే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు ఎగ్జామ్స్ కోసం చదువుతూ… టీ, కాఫీ, పిజ్జా వంటివి మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిజ్జా, బర్గర్ల వంటి వాటిలో ఫ్రై చేసిన ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. అది త్వరగా నిద్ర వచ్చేలా చేస్తుంది. అందుకే ఫ్రై పుడ్‌కి దూరంగా ఉండాలి.

brain must be very sharp which means this dietదాని బదులు కూరగాయలు, ఆకు కూరలతోపాటూ యాపిల్ వంటివి గాని పుల్లగా ఉండే సిట్రస్ పండ్లను గాని ఎక్కువగా తీసుకోవాలి. మొలకల వంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం ఉండే ఖర్జూరాల లాంటివి తింటే బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. క్యారెట్, ఆకు కూరల్లోని A విటమిన్ కళ్లకు మేలు చేస్తుంది. అందువల్ల అలాంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలి.

brain must be very sharp which means this dietఇవే కాదు బ్రెయిన్ బాగా పనిచెయ్యాలంటే, నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అలాగే గాలి బాగా తగిలే ప్రదేశంలో కూర్చోవాలి. చుట్టూ మొక్కలు, చెట్లూ ఉంటే బాడీకి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. చదివింది బాగా మైండ్‌లోకి వెళ్తుంది. స్వీట్, చాకొలెట్ వంటివి ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. కాబట్టి వాటిని వీలైనంత దూరంగా పెట్టడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఎగ్జామ్స్‌లో చదివింది మర్చిపోకుండా బాగా రాస్తారు

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR