మెగ్నీషియం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
244

అన్ని పోషకాలు ఉంటేనే శరీరం సరిగా పని చేస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటాము. ఏది తగ్గినా అనారోగ్యం తప్పదు. శరీరాన్ని సమతుల్యంగా ఉంచే వాటిలో మెగ్నీషియం. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది.

The health benefits of magnesium to our bodyమనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను అందించి ఆదుకుంటుంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే, చివరకు మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉంది. శరీరానికే కాదు, తగినంత మెగ్నీషియం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులతో ముడిపడి ఉన్న ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

health benefits of magnesiumమెగ్నీషియం శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు చక్కగా నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైంల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచీ మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియంది కీలక పాత్ర. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, నరాలు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండాలంటే కూడా మెగ్నీషియం ఎంతో అవసరం.

మరి అన్ని ప్రయోజనాలు కలిగించే మెగ్నీషియం ఏ ఆహార పదార్థాల్లో లభిస్తుందో తెలుసుకుందాం.

health benefits of magnesiumమెగ్నీషియం గుమ్మడికాయ గింజల్లో ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయల్లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు డార్క్ చాకొలెట్స్‌లలో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఖర్జూరాలు, బఠాణీలు, కోకో, బ్రకోలీ, క్యాబేజీ, గ్రీన్ బఠాణీలు, మొలకలు, సాల్మన్‌ చేపలు, ట్యూనా చేపలు, బ్రౌన్‌రైస్‌లతో మెగ్నీషియం దొరుకుతుంది.

health benefits of magnesiumవీటితో పాటు బాదం, జీడిపప్పు, బ్రెజిల్ గింజలు మెగ్నీషియం లభించే మంచి వనరులు. అరటిపండ్లలో కూడా కావాలిసనంత మెగ్నీషియం లభిస్తుంది. అరటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు సంఖ్య తగ్గుతుంది.

 

SHARE