మన సాంప్రదాయంలో కొబ్బరి కాయ ప్రాముఖ్యత…

భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది. భారత సంస్కృతిలో హిందూ మతం ఎక్కువ పాత్రను పోషిస్తుంది.

indian traditionఅయితే హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం అయినా ఏ దైవ కార్యం అయిన కొబ్బరి కాయ లేనిదే జరగదు. మొదట కొబ్బరి కాయ కొట్టి ఏ కార్యాన్ని అయినా ప్రారంభించటం అనాదిగా ఒక ఆచారంగా వస్తుంది.

coconut breaking in templeదేవుడికి కొబ్బరి కాయ కొట్టి ఆ నీటితో అభిషేకం చేసి ఆ కొబ్బరి చెక్కలను నైవేద్యంగా పెడతారు. పూజలు, వ్రతాల సమయంలో కొబ్బరికాయను కొట్టి నివేదన చేస్తారు. భారతీయ పూజ విధానంలో కొబ్బరికాయకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది.

coconutకొబ్బరికాయకు మూడు కనులు ఉండుట వల్ల ముక్కంటి కాయ అని కూడా అంటారు.
కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు ముక్కలుగా అవుతుంది. ఈ రెండింటిని జీవుడు దేవుడికి ప్రతీకగా భావిస్తారు.

కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను బ్రహ్మనాడిగా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది. బ్రహ్మనాడిద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.

coconutకొబ్బరికాయ ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. మూత్ర సంబంధమైన వ్యాధులకు, పార్శ్వపు నొప్పులకు, అతిసారానికి మంచి ఔషధంగా కొబ్బరినీరు పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికపరమైన సందేశాన్ని ఇచ్చే కొబ్బరి మన ఆచారాల్లో ప్రధానమైన స్థానాన్ని సంపాదించింది.

migraine

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR