ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన శివలింగంగా పేరు పొందిన ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా

ఇండియాలో ఉన్న పెద్ద శివలింగాలలో భోజేశ్వర్ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. అసంపూర్తిగా ఉన్న ఈ అద్భుతమైన ఆలయం శివుడికి అంకితం చేయబడింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోజ్పూర్ లో గల ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల కథనం. ఈ భారీ శివలింగానికి భీముడు పూజలు నిర్వహించాడట. ఈ ఆలయం విశిష్టత భారీ శివలింగమే. మృదువైన ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ శివలింగం ఒకే రాయి నుండి తయారైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన శివలింగంగా ఖ్యాతిగాంచింది.

అతిపెద్ద పురాతన శివలింగంఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలచబడి, 7.5 అడుగుల పొడవు మరియు 17.8 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉన్నది. అపారమైన శివలింగం కారణంగా ఈ ఆలయం ‘తూర్పు సోమ్నాథ్’ అని పిలువబడుతున్నది. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి పడమటి దిశలో మెట్లు ఉన్నాయి. గర్భగుడి తలుపులకు ఇరువైపులా గంగా మరియు యమున నది దేవతల విగ్రహాలు అలంకరించబడ్డాయి. దీనితో పాటు, గర్భగుడి యొక్క భారీ పై స్తంభంపై, శివ-పార్వతి, బ్రహ్మ-సరస్వతి, రామ-సీత మరియు విష్ణు లక్ష్మి దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసారు.

అతిపెద్ద పురాతన శివలింగంఈ ఆలయాన్ని సమకాలీన చేతివృత్తులవారు, వాస్తుశిల్పులు నిర్మించారు. ఇప్పటి ఇంజనీర్లకు ఈ ఆలయ నిర్మాణం ఒక కళాశాలలా ఉంటుందని చారిత్రకారుల కథనం. ఈ ఆలయం భారతదేశంలో ఇస్లాం రాకముందు నిర్మించబడింది. ఆలయ నిర్మాణం యొక్క నిర్మాణ ప్రణాళిక యొక్క పటాలు మరియు ఇతర వివరాలను ప్రక్కనే ఉన్న రాళ్ళపై చెక్కారు. ఇప్పటికీ ఆ పాటలను అక్కడ స్పష్టంగా చూడవచ్చు.

అతిపెద్ద పురాతన శివలింగంఅయితే ఈ అద్భుతమైన ఆలయానికి ఓ రహస్యం ఉంది. భోజేశ్వర్ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. కానీ దాని నిర్మాణం ఎందుకు అసంపూర్తిగా ఉందనే దానిపై చరిత్రలో ఎటువంటి ఆధారాలు లేవు. ఈ శివాలయాన్ని వనవాస సమయంలో పాండవులు నిర్మించారని పురాణాల కథనం. భీముడు మోకాళ్లపై కూర్చుని ఈ శివలింగం మీద పువ్వులు అర్పించేవాడట.

అతిపెద్ద పురాతన శివలింగంద్వాపర యుగంలో ఓ రాత్రి పాండవులు మాతా కుంతి ఆరాధన కోసం ఈ శివలింగం నిర్మించారు. తెల్లవారుజామున, పాండవులు అదృశ్యమయ్యారు అందుకనే ఈ ఆలయం అసంపూర్ణంగా మిగిలిపోయిందని స్థానికులు చెబుతారు. అంతేకాదు ఈ ఆలయానికి సమీపంలో బేత్వానది ఉంది. ఈ నదిలోనే కుంతి కర్ణుడిని విడిచిపెట్టినట్లు ఓ కధనం కూడా ఉంది.

అతిపెద్ద పురాతన శివలింగంప్రస్తుతం ఈ ఆలయం చారిత్రక స్మారక చిహ్నంగా భారత పురావస్తు సర్వే ఆధ్వర్యంలో ఉంది. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భోజ్‌పూర్ పండుగను నిర్వహిస్తుంది. భోజ్పూర్ లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు రెండు. ఒకటి భోజేశ్వర ఆలయం, మరొకటి పార్వతి గుహ. వీటితో పాటు జైన దేవాలయాలను, రాయల్ ప్యాలెస్ ను కూడా సందర్శించవచ్చు.

పార్వతి గుహ

అతిపెద్ద పురాతన శివలింగంపార్వతి గుహ భోజ్పూర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది భోజేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉంది. ఈ గుహలో క్రీ. శ. 11 వ శతాబ్ద కాలానికి చెందిన అనేక రాతి నిర్మాణాలు, పురాతన శిల్పాలు కలవు. పర్యాటకులను ఇక్కడ ఉన్న భోజుపూర్ దేవాలయం మరియు పార్వతి గుహ ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అనటంలో అతిశయోక్తి లేదు.

జైన దేవాలయం

అతిపెద్ద పురాతన శివలింగంజైన దేవాలయాలు భోజేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా అన్ని అజిన దేవాలయాల వలెనే మూడు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వర్ధమాన మహావీరుని 20 అడుగుల విగ్రహం, మిగిలిన రెండు విగ్రహాలు పార్శ్వనాథుడువి గా ఉన్నాయి

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR