The Longest Complete Lunar Eclipse Of the Century Will Occur This Firday

ఈ సంవత్సరం జనవరి 31 వ తేదీన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఆకాశంలో కనువిందు చేసాడు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. ఈ అరుదైన చంద్రగ్రహణం మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేసింది. ఇది ఇలా ఉంటె జులై 27 వ తేదీన మళ్ళీ ఆకాశంలో అరుణవర్ణ చందమామ అంటే బ్లడ్‌ మూన్‌ కనువిందు చేయనుంది. అయితే ఈ సంవత్సరం  రెండో సారి ఏర్పడుతున్న ఈ బ్లడ్‌ మూన్‌ ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణంగా చరిత్రలో నిలిచిపోనుంది. మరి బ్లడ్ మూన్ అంటే ఏంటి? ఈ రోజు ఏర్పడే చంద్రగ్రహణానికి ఉన్న ప్రత్యేక ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

complete lunar eclipse of the century

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేది సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

complete lunar eclipse of the century

ఇక  బ్లడ్ మూన్ విషయానికి వస్తే, సంపూర్ణ చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపురంగులో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. తెలుగులో అరుణవర్ణ చందమామ అని అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే సమయంలో వెనక వెపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత చంద్రుడిపై పడుతుంది. ఆ కాంతి ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కవ తరంగ దైర్ఘ్యం ఉన్న ఎరుపు కాంతి చంద్రుడిని చేరుతంది. దీంతో బ్లడ్ మూన్ ఏర్పడుతుంది. అయితే  మామూలు రోజుల్లో కనిపించే చందమామతో పోలిస్తే 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతిమంతంగా ఈరోజు మనకి కనిపిస్తాడు.

complete lunar eclipse of the century

అయితే జనవరి 31న ఏర్పడిన సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ 63 నిమిషాలు మాత్రమే కొనసాగిందని, జులై 27 వ తేదీన కనిపించే బ్లడ్ మూన్ దాదాపు 103 నిమిషాలు కొనసాగడం ద్వారా ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు తెలిపారు. ఎందుకంటే భూమి నుంచి చందమామ గరిష్ఠ దూరంలో ఉంటుందని, కాబట్టి భూమి నీడను దాటడానికి దానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని అందుకే రానున్న బ్లడ్ మూన్ ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంగా రికార్డులకెక్కుతుందని వెల్లడించారు.

complete lunar eclipse of the century

జులై 27 రాత్రి 10.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం జులై 28 న తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనుమరుగు కావడానికి బదులు, భూ వాతావరణంపై ప్రసరించే సూర్యకాంతి వల్ల ఎరుపు రంగును సంతరించుకుంటాడు.

complete lunar eclipse of the century

ఇది ఇలా ఉంటె, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో బ్లడ్ మూన్ కనిపిస్తుంది. ఇక ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌-పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజలు దీన్ని వీక్షించలేరని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR