Home Unknown facts శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉండే ఆలయం

శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉండే ఆలయం

0

మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలోని శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉండటం ఒక విశేషం అయితే, ఇక్కడ ఉన్న శివలింగం పైనుండి ఐదు నదులు ప్రవహించడం మరొక విశేషం. ఇంకా కృష్ణానది పుట్టింది ఇక్కడే అని కూడా చెబుతారు. మరి ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ పంచ గంగ అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

5 Rivers Flow Above Shiva Lingam

మహారాష్ట్ర, పుణెలోని, బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే కృష్ణానది జన్మించింది. అంతేకాకుండా ఇక్కడే వెన్న, సావిత్రి, గాయత్రీ, క్వయిన అనే నదులతో కలిపి మొత్తం ఐదు నదులు ఇక్కడే జన్మించినట్లుగా చెబుతారు.

అయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన నుండి ఈ ఐదు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడి శివలింగం రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్నా ఈ రెండు నదులు కలసి కృష్ణవేణి నదిగా ముందుకు ప్రవహించగా, కోయినానది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది.

ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంద్రాలు ఉండగా, ఇవి ఒకదానికి ఒకటి ఆరు అగుడుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంద్రం గుండా నీరు ఎపుడు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుకవైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంద్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు.

ఈ మందిరం నుండి బయటికి రాగానే అక్కడ మనకి మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని మహాబలేశ్వరస్వామి శివలింగ విగ్రహ మూర్తిగా దర్శనం ఇస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగ ని చూసి తరిస్తారు

Exit mobile version