కార్తీక మాసంలో ఎన్ని దీపాలను చూస్తామో అంత పుణ్యం వస్తుందట!

దీపావళి సంబరమే వేరు. దాదాపుగా నెలరోజుల ముందునుంచీ హడావుడి. టపాసుల తయారీ కోసం.. వాటిని కాల్చడం కోసం ఎదురుచూపులు. బోలెడన్ని ప్లానులు.. కాకరపూవొత్తుల వెలుగులు.. సిసింద్రీల చిట చిటలు.. మతాబుల ముచ్చట్లు.. చిచ్చుబుడ్డి కవ్వింతలు.. సందడిని అంబరానికి చేర్చే తారాజువ్వల కేరింతలు.. భయపెట్టే లక్ష్మీ బాంబులు.. బెదిరించే పెటేపికాయలు(తాటాకు బాంబులు)..ఫట్ ఫట్ లాడించే సీమ టపాకాయలు.. వీటన్నిటి హడావుడిని నిశ్శబ్దంగా చూస్తూ తమలో తాము నవ్వుకునే దీపాల వరుసలు.. ఇలా జీవితాన్ని మొత్తం మనకి చూపించే వెలుగుల పండుగ దీపావళి!

diwali bombsదీపావళి పండుగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళాన్ని తనతో తీసుకు వస్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనదని పండితులు చెబుతారు. ఇటు శివ భక్తులు.. అటు వైష్ణవ ప్రియులు కూడా కార్తీక మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివాలయాల్లో దీపతోరణాలు.. ఆకాశాదీపాలు. ప్రత్యేక అభిషేకాలు..పూజలు కనుల పండువగా నిర్వహిస్తారు.

lord shivalingam abhishekకార్తీక మాసంలో శివాలయంనకు వెళ్లి అభిషేకాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు.
దీపాలు వెలిగించటం, తెల్లవారుజామున స్నానాలు, ఉపవాసాలు మొదలైనవి కార్తీక మాసం యొక్క విశిష్టతలు.

kartik masam lampsకార్తీక మాసంలో నెల రోజులు మంచి రోజులే.
ఆ రోజుల్లో చేసే ఏ పూజ అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పన్నెండు మాసాలలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏ మాసానికి లేదు. చాలా మంది కార్తీక మాసం నెల రోజులు పూజలకు అంకితం అయ్యిపోతారు.

సాధారణంగా అందరు కార్తీకమాసం అంటే శివార్చన మాత్రమే చేయాలనీ అనుకుంటారు. కానీ కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరిది. ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు విష్ణువు, మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శివుడి పూజిస్తారు .ఈ విధంగా పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతాం. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ కార్తీక మాసంలో చేయకూడని తప్పులు గురించి మీకు తెలుసా…ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం…

kartik masamకార్తీక మాసంలో తలస్నానం ముఖ్యం. తల స్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి.
ఎటువంటి షాంపూ పెట్టకూడదు. అలాగే సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి.
కొంత మంది తలా స్నానం చేయటానికి ముందు ఆముదం వంటివి తలకు రాస్తూ ఉంటారు ఆలా చేయకుండా ఉంటేనే మంచిది.

tulsiకార్తీక మాసంలో అసలు మాంసం జోలికి వెళ్ళకూడదు.
అలాగే గుడ్డు, మసాలాలకు కూడా దూరంగా ఉంటే మంచి పుణ్య ఫలం దక్కుతుంది. కార్తీకమాసంలో మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు.
ఎందుకంటే ఉపవాసం చేసే సమయంలో నిద్ర పొతే అది పెద్ద పాపం. దీపం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కార్తీక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించకూడదు. ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే పాప ఫలితం వస్తుంది.

fastingఅలాగే కార్తీక మాసంలో దీపం ఎక్కడైనా కోడెక్కితే ఆ దీపాన్ని సాధ్యమైనంత వరకు వెలిగించాలి.
కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎన్ని దీపాలను చూస్తామో అంత పుణ్యం వస్తుందట. కార్తీక మాసంలో శివునికి తులసిని అసలు సమర్పించకూడదు. విష్ణు మూర్తికి సమర్పించాలి. తులసి విష్ణు మూర్తికి చాలా ప్రియమైనది. శివునికి ఎప్పుడు శివునికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR