సృష్టి నశించిన తర్వాత కూడా శివుడు ఉండడానికి గల కారణం

శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అంటే కాలానికి వశం కానివాడు. అందుకే సదాశివుడు అని పిలుస్తారు. అన్నీ శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అంటే అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు.

శివుడుసృష్టికి ముందు ఉండే ఏకైక దైవం!
సృష్టి నశించిన తరువాత ఉండే ఏకైక దైవం!

ప్రళయంలో సర్వ ప్రపంచం నశించినప్పుడు కూడా నశించక సదా కొలువై ఉండే దైవం శివుడేనని మహాభారత వచనం. శివునికి సృష్టికి గల సంబంధం సముద్రానికి అలకు గల సంబంధం లాంటిది. అల పుట్టకముందు సముద్రం ఉన్నది. నశించిన తరువాత కూడా సముద్రం ఉంటుంది. అదేవిధంగా సృష్టి ముందు శివుడు ఉన్నాడు. సృష్టి నశించిన తర్వాత కూడా శివుడు ఉంటాడు. అందుకే యజుర్వేదం.

శివుడు“నమో అగ్రీయయ చ ప్రథమాయ చ”

సృష్టికి ముందరి వాడు ప్రథముడైన శివుడికి వందనం అని శివుడికి నమస్కరించింది. ఎన్నో అలలు సముద్రంలో జన్మించి, సముద్రంలోనే స్థితి కలిగి చివరికి సముద్రంలోనే ముగిసిపోతుంది అదేవిధంగా శివుని లోనే సృష్టి జరిగి శివుని లోని స్థితి కలిగి చివరకి శివుని లోనే ముగుస్తుంది. అందుకే పరబ్రహ్మం అంటే ఏమిటో “ఐతరేయోపనిషత్” లో వరుణ దేవుడు తన కుమారుడైన” భృగు మహర్షికి” ఇలా వివరించెను.

శివుడు నాయనా! సమస్త చరాచర ప్రపంచమంతా దేని నుండి జనించి, దేనిలో జీవించి దేనిలో చివరికి లయిస్తూoదో ఆ దైవం శివుడు! అని చెప్పడం జరిగింది. ఒక్క శివుడు తప్ప, బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు సృష్టికి సంబంధించిన వారే. ఒక్క శివుడు మాత్రమే సృష్టికి అతీతమైన వాడు, ఆధారమైనవాడు, అధిష్టానం అయినవాడు. “నీవెవరు?” అని పరమేశ్వరుని ప్రశ్నించిన దేవతలకు పరమేశ్వరుడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా?

శివుడుసృష్టికి ముందు నేనొక్కడినే ఉన్నాను సృష్టి కాలంలో జీవాల జీవులలో అంతర్యామిగా అన్నింటా నేను ఉంటాను. సృష్టి అనంతరం నేనొక్కడినే ఉంటాను. నాకు సదా తోడుగా ఉండే వాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పాడు. అందుకే” వశిష్ఠ మహర్షి శ్రీ రామునికి” జ్ఞానోపదేశం చేస్తూ, శ్రీ రామ! నీవు గొప్పగా భావించే బ్రహ్మ విష్ణు రుద్రులు అలలు వంటి వారు నీటి బుడగల వంటి వారు. కానీ శివుడు సాగరము లాంటి వాడని శివుని యొక్క వైభవాన్ని ఇలా తెలిపాడు.

శివుడు ఓ రాఘవ! నేటికి అనేక లక్షల మంది బ్రహ్మలు, వందలకొద్ది శంకరులు, వేలకొద్ది నారాయణులు, గతించారు అని తెలిపాడు. అందుకే నీవు అలను చూడవద్దు, సముద్రాన్ని చూడు అన్నారు. కాబట్టి అలల వంటి దేవతలను వదిలి సాగరం వంటి శివుని సేవించి, తరించు! అని చెప్పాడు.

శివుడుమరొక ఇతిహాసంలో.. “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహం చేసుకోవాలని కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన తరువాత, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రాన్ని ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు.” అని ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR