Home Unknown facts శనీశ్వరుడి ప్రసిద్ధ ఆలయం ఎక్కడ ఉంది ? మరియు ఆలయ విశేషాలు

శనీశ్వరుడి ప్రసిద్ధ ఆలయం ఎక్కడ ఉంది ? మరియు ఆలయ విశేషాలు

0

శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిదని, శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా ఉంటారని చెబుతుంటారు. శని గ్రహం అంటే అందరికీ చెప్పలేని భయం. శని క్రూరుడనీ, కనికరం లేనివాడనీ, మనుషుల్ని పట్టుకుని పీడిస్తాడనీ అనుకుంటారు. ఇది ఇలా ఉంటె శనికి సంబంధించిన ప్రసిద్ధ ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

saniswaruduతమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే నలమహారాజుకు శని పట్టుకొని పీడించడం ప్రారంభించాడని పురాణం. ఇక్కడకి నల తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

ఈ ఆలయంలో వెలసిన స్వామివారి పేరు దర్బరణ్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయంలో గరిక మొక్కని అతి పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్బాధిపతి అని కూడా అంటారు. ఇక్కడ దేవాలయాన్ని దర్శించినప్పుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని భక్తుల నమ్మకం.

ఇక్కడ నలనారాయణ దేవాలయం అనే వైష్ణవ దేవాలయం ఉంది. నలదమయంతుల విగ్రహాలు గల ఆలయం ఇది. శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజించినవారికి శని ప్రభావం ఉండదు. ఈ ఆలయం నాలుగు యుగాలలో నాలుగు పేర్లతో పిలవబడినట్లు తెలియుచున్నది.

ఇక ఈ ఆలయంలోని శనీశ్వరుడికి బంగారు కాకి వాహనంగా ఉంది. అయితే ప్రత్యేకంగా శనివారం నాడు మరియు ఉత్సవాల సందర్భంగా మూలా విగ్రహానికి బంగారు కవచం తొడుగుతారు. శనిదేవుకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి శనిపీయేర్చి అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున భక్తులు లక్షల కొద్దీ మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి నువ్వులు చిన్న చిన్న పొట్లాలు కట్టి శనిదేవుని ముందు ఉంచుతారు. ఈ ఆలయానికి ప్రత్యేక దినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version