ఇంద్రుని కళ్ళు తెరిపించిన రామ చిలుక ఎం చెప్పిందో తెలుసా ?

ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు.

devendruduమహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూసి ఇంద్రాది దేవతలు పక్షీశ్వరా ఈ వృక్షం బాగా శుష్కించిపోయింది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనాకూడా నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది అని అడిగారు. చిలుక ఇలా బదులిచ్చింది

devendruduఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలా అయిపోయింది. కాలగతిని ఆపడం ఎవరి తరము. ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేను ఈరోజు శుష్కించినదని వదిలిపెట్టలేను. అలా చేస్తే అది కృతఘ్నత గాథకం అవుతుంది. దానికి మించిన మహాపాపం మరొకటి లేదు నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలకన్నా ఎక్కువ అని చెప్పింది.

devendruduఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూసి దేవేంద్రుడిలా అన్నాడు . ఓ శుక రాజమా నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసాయి వినాలని ఉంది మాకు. అప్పుడు చిలుక ఇలా చెప్పింది నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలడిని. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది.

devendruduచిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. అయ్యా నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు.

devendruduఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR